Karnataka: కర్ణాటక నూతన మంత్రిమండలి జాబితా రేపు విడుదల కానుంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధిష్టానంతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనే వివరాలపై చర్చ జరిగినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక మంత్రిమండలిలో(Karnataka Cabinet) మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఎన్నిక అనంతరం మంత్రిమండలి విషయంలో ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధిష్టానంతో సీఎం బొమ్మై సమావేశమయ్యారు. తాజాగా సోమవారం రాత్రి బీజేపీ నేత జేపీ నడ్డాతో(JP Nadda), కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. మంత్రివర్గ ఏర్పాటుపై చర్చ అనంతరం వివరాలు వెల్లడించారు. ఇప్పటికే 2-3 జాబితాలు ఇచ్చానని..మంత్రులు, డిప్యూటీ సీఎంలుగా ఎవరనేది అధిష్టానం తేల్చనుందని సీఎం బొమ్మై(Basavaraj Bommai) తెలిపారు. కొత్త మంత్రివర్గం జాబితా రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయి. జాబితా విడుదల కాగానే కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. పార్టీలో ఫిరాయింపుదారులు, వలసదారులు లేరని..అంతా బీజేపీ నేతలేనని స్పష్టం చేశారు. 


మంత్రిమండలి కోసం తరచూ ఢిల్లీ పర్యటన చేపట్టడంపై సీఎల్పీ నేత సిద్ధరామయ్య(Sidha Ramaiah) విమర్శలు ఎక్కుపెట్టారు. పదేపదే ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్యేలు పని చేయకుండా మంత్రి పదవుల కోసం ఢిల్లీలో ఉంటున్నారని విమర్శించారు.  


Also read: పెగసస్‌పై చర్చకు పట్టుబడిన విపక్షాలు, రాజ్యసభ వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook