Karnataka: కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి ఆంక్షలు విధించేందుకు అక్కడి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి దాదాపుగా తగ్గడంతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండటంతో ఆందోళన రేగుతోంది. ముఖ్యంగా కర్ణాటక పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. దీనికి కారణం కేసుల సంఖ్య కంటే..చిన్నారుల్లో ఎక్కువగా సంక్రమిస్తుండటమే.  కేవలం 11 రోజుల వ్యవధిలో కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో 5 వందలకు పైగా చిన్నారులు కోవిడ్ బారినపడ్డారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Karnatka cm Bommai)ఆధ్వర్యాన నిపుణులు, అధికారులతో కీలకమైన సమావేశం జరిగింది. కరోనా థర్డ్‌వేవ్ అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ తరహా ఆంక్షల్ని విధించక తప్పదని నిర్ణయించారు. ప్రస్తుతానికి లాక్‌డౌన్ అవసరం లేదని..అయితే కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటితే మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని విధిస్తామని ముఖ్యమంత్రి బొమ్మై తెలిపారు. 


కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) చిన్నారులపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపధ్యంలో తల్లిదండ్రులు మరింతగా శ్రద్ధ వహించాలన్నారు. ఉన్న నిబంధనల్నే కఠినంగా అమలు చేస్తామన్నారు. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటితే లాక్‌డౌన్ (Lockdown)విధించాల్సి వస్తుందన్నారు. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాల్ని నిషేధించాల్సిందేనని నిపుణులు తెలిపారు. స్కూల్స్, కళాశాలలు సెప్టెంబర్ వరకూ తెరవకుండా ఉంటే మంచిదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ కంటే వీకెండ్ కర్ఫ్యూ మంచిదనే నిర్ణయం వెలువడింది. నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ఇతర రాష్ట్రాలవారిని అనుమతిస్తారు. అంత్యక్రియలకు కేవలం పదిమందికే అనుమతి ఉంటుంది. పబ్‌లు, బార్లు, జిమ్‌లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాలు మూసివేయాలని నిర్ణయించారు. దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం ఉండకూడదని..ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి ఉండకూడదని నిర్ణయించారు. జనం రద్దీగా ఉండే మార్కెట్‌లను తాత్కాలికంగా మూసివేయాలని..ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ నిత్యావసర విక్రయాలు జరపాలని అభిప్రాయపడ్డారు. 


Also read: India Corona Vaccination: దేశంలో 53 కోట్లు దాటిన కరోనా వ్యాక్సినేషన్, స్థిరంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook