India Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా ఆంక్షలు సడలించే కొద్దీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి క్రమంగా తగ్గినా..గత కొద్దిరోజులుగా ఇండియాలో కొత్త కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరోసారి 38 వేల 667 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో దాదాపు నెలన్నర నుంచి కరోనా కొత్త కేసుల సంఖ్య ప్రతిరోజూ 35-40 వేల మధ్యలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 673 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అటు కోవిడ్ నిర్దారణ పరీక్షలు కూడా దేశవ్యాప్తంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 22 లక్షల 29 వేల 798 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ 49 కోట్లమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. గత 20 రోజుల్నించి మాత్రం ఈ పాజిటివిటీ రేటు 3 శాతముంది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకూ 53 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకూ దేశంలో 60 లక్షల 88 వేల శిబిరాల్లో 53 కోట్ల 61 లక్షల 89 వేల 903 మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. గత 24 గంటల్లో అయితే దేశంలో 63 లక్షల 80 వేల 937 వ్యాక్సిన్‌లు ఇచ్చారు. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.45 శాతానికి చేరుకుంది.
Also read: Independence Day2021: ఎర్రకోట సాక్షిగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook