Karnataka: కరోనా రోగులకు బెడ్స్ లేక ఇబ్బంది పడుతుంటే..కొందరేమో బెడ్స్ ఖాలీ చేయడం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే..ఇంటికెళ్లే మాటే ఎత్తడం లేదు. ఫలితంగా ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona virus) విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఆక్సిజన్ కొరత(Oxygen Shortage), మరోవైపు బెడ్స్, అత్యవసర మందుల కొరత వెంటాడుతోంది. అసలే బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే కొందరేమో విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. కర్నాటకలో అదే జరిగింది. కర్నాటక(Karnataka)లోని శివాజీనగరలో కోవిడ్ వార్ రూమ్స్‌లను ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. కొందరు కోవిడ్ (Covid19) నుంచి కోలుకున్నా సరే ఇళ్లకు వెళ్లకుండా ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. ఇది తెలుసుకున్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప( Cm Yediyurappa) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 503 మంది కరోనా రోగులు 20 రోజులు ఆసుపత్రుల్లోనే ఉండి కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బెడ్స్ కొరత ఉండటంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని యడ్యూరప్ప సూచించారు.రోగుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామని..గందరగోళం సృష్టించవద్దని కోరారు. మరోవైపు కోవిడ్ వార్ రూమ్ సిబ్బంది సేవల్ని ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొనియాడారు.


Also read: India Corona Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు, 2.5 లక్షలు దాటిన COVID-19 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook