Karnataka: కర్ణాటకలో రాజకీయాలు మారనున్నాయి. ముఖ్యమంత్రిని మార్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో యడ్యూరప్ప సమావేశానికి కారణమిదేనని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలో (Karnataka)చాలాకాలంగా ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను మార్చాలంటూ ఆయన వ్యతిరేకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)తో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆకస్మిక సమావేశానికి కారణం ఇదేనని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి యడ్యూరప్ప అంగీకరించినట్టు సమాచారం. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తనకు ప్రాధాన్యతతో పాటు తన కుమారులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని యడ్యూరప్ప కోరినట్టు సమాచారం.ఇక యడ్యూరప్ప రాజీనామా కేవలం లాంఛనమేనని..త్వరలో కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన యడ్యూరప్ప(Yediyurappa),..తన షరతుల్ని ఆయన ముందుంచినట్టు సమచారం. 


Also read: Corona Third Wave: ముంచుకొస్తున్న కరోనా థర్డ్‌వేవ్, 100 రోజులు అత్యంత కీలకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook