College students wear saffron scarves against hijab : కర్ణాటకలోని (Karnataka) కొప్ప జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 'డ్రెస్ కోడ్' వివాదం తలెత్తింది. కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో క్లాసులకు హాజరయ్యారు. ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని అనుమతించినప్పుడు... తాము కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా అనుమతించాల్సిందేనని ఆ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. దీంతో హిజాబ్ ధరించి (Wearing Hijab in Classroom) క్లాసులకు హాజరు కావొద్దంటూ కాలేజీ యాజమాన్యం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులంతా ఆ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరవడంతో మళ్లీ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో కొంతమంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు.


తాజా వివాదం నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించవచ్చునని స్పష్టం చేసింది. ఇదే విషయంపై ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఆ సమావేశంలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని... ఆ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని వెల్లడించింది. 


నిజానికి అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో.. కొంతమంది విద్యార్థినులు హిజాబ్ (Hijab) ధరించి క్లాసులకు రావడం... దాన్ని నిరసిస్తూ ఓ బ్యాచ్ కాషాయ కండువాలతో క్లాసులకు రావడంతో వివాదం మొదలైందన్నారు. దీనిపై కాలేజీకి చెందిన ఓ బీకామ్ విద్యార్థి మాట్లాడుతూ... క్లాస్ రూమ్స్‌లో హిజాబ్ ధరించవద్దని కాలేజీ యాజమాన్యం చాలాసార్లు చెప్పిందని... అయినప్పటికీ ఒక సెక్షన్ మహిళలు ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా క్లాస్ రూమ్‌లోకి హిజాబ్ ధరించి రావడాన్ని ఆపకపోతే తమ నిరసనలను (Karnataka News) మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


Also Read: Rishabh Pant Record: రిషబ్ పంత్‌ అరుదైన రికార్డు.. నాలుగో భారత వికెట్‌ కీపర్‌గా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి