కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు పదకొండున్నర గంటలకు తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరడానికి యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు కొద్దిసేపటి క్రితం వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న యెడ్యూరప్పతో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. మరికొందరు కూడా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు యెడ్యూరప్ప అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


కర్ణాటకలో ప్రజాస్వామ్యయుతంగా తమకు మెజారిటీ వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.


కర్ణాటక ప్రజలు బిజెపి పక్షాన తీర్పు ఇచ్చారని ఆ పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి అనంతకుమార్‌ చెప్పారు. ప్రజా తీర్పును కాంగ్రెస్‌ అంగీకరించాలని ఆయన అన్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.