Sidda Ramaiah Join Bjp Soon: బీజేపీ గూటికి సిద్ధరామయ్య.. కర్ణాటకలో కాంగ్రెస్ కు బిగ్ షాక్?
Sidda Ramaiah: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో మళ్లీ ఎలాగైనా గెలవాలని స్కెచ్ వేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ లోని బడా నేతకు గాలం వేసినట్లు తెలుస్తోంది.
Sidda Ramaiah: దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ కు అధికారం దక్కే అవకాశాలున్న రాష్ట్రంలో కర్ణాటక ఒకటి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అధికారంలోకి వస్తామని ధీమా కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు కొంత కాలంగా పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో మళ్లీ ఎలాగైనా గెలవాలని స్కెచ్ వేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ లోని బడా నేతకు గాలం వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ బడా నేత కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. సిద్ధరామయ్యతో ఇప్పటికే బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని, ఆయన డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులకు 20 సీట్లు కావాలన్న సిద్దూ డిమాండ్ కు కమలం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రెండు ,మూడు రోజుల్లో సిద్ధరామయ్య కాషాయ కండువా కుప్పుకుంటారని కర్ణాటక బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ పార్టీలో చేరుతారని కర్ణాటక మంత్రి ఆర్ మునిరత్న ఓపెన్ గానే చెప్పారు.
కర్ణాటకలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్లలో 15 మంది సిద్ధరామయ్య అనుచరులే. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కార్ లో మంత్రి పదవులు రాకపోవడంతో వాళ్లంతా బీజేపీలో చేరారు. తర్వాత ఉప ఎన్నికలో గెలిచి యడ్యూరప్ప కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు. కుమారస్వామి సర్కార్ కూలిపోవడానికి ఆ నేతలే కారణమయ్యారు. అప్పుడే సిద్ధరామయ్యపై ఆరోపణలు వచ్చాయి. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధరామయ్యే తన మనుషులను బీజేపీలోకి పంపించారని జేడీఎస్ కూడా ఆరోపణలు చేసింది. తాజా ఘటనలతో అదే నిజమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు సిద్దరామయ్య బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడానికి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు కారణమనే చర్చ సాగుతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా డీకేకే ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో శివకుమారే ముందుంటారనే టాక్ నడుస్తోంది. దీంతో సిద్ధరామయ్య ముందే తన దారి తాను చూసుకుంటున్నారని చెబుతున్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప తర్వాత బీజేపీకి బలమైన నేత లేకుండా పోయారు. అందుకే సిద్ధరామయ్యకు గాలం వేశారని అంటున్నారు. మొత్తంగా సిద్దరామయ్య బీజేపీలో చేరితే.. అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకేననే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.
Ktr Fires On Rahul Gandhi: రాహుల్ ఓ అజ్ఞాని, ఓ డమ్మీ: మండిపడ్డ కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook