Ktr Fires On Rahul Gandhi: వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. కేసీఆర్ ఓ రాజని, అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చేశారు. ఎవరైనా టీఆర్ఎస్, బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. రైతు డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా వరంగల్ సభా వేదికగా ప్రకటించారు రాహుల్ గాంధీ.
రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. రాహుల్ తన బావదారిద్య్రాన్ని, అవగాహనలేమిని, రాజకీయ అజ్ఞానాన్ని ఇక్కడకొక్కి ప్రదర్శించారని ఫైరయ్యారు. అసలు డిక్లరేషన్ చేయడానికి రాహుల్‌కు ఉన్న పదవేంటని ప్రశ్నించారు. మమ్మీ కాంగ్రెస్ అధ్యక్షురాలని.. మరి ఈ డమ్మీ ఏంటో ఎవరికీ తెలియదన్నారు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో.. ఎప్పుడు బయటుండతో కూడా ఎవరూ ఊహించలేరన్నారు. రాహుల్ మాట్లాడింది ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికే అర్థంకావాలన్నారు కేటీఆర్. రాహుల్ చెప్పేది నమ్మడానికి ఇది టెన్ జన్‌పథ్ కాదు.. ప్రజా చైతన్యానికి మారుపేరైన తెలంగాణ జనపథమన్నారు. కాంగ్రెస్ వాళ్ల ఎత్తు, పొడుగు, లోతు అన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
తెలంగాణలో ఒక్కఛాన్స్ అడుగుతున్న రాహుల్ ...ఇన్నాళ్లూ దేశప్రజలిచ్చిన ఛాన్సులను ఏం చేశాడని ప్రశ్నించారు కేటీఆర్. మీ నాయన, నాయనమ్మ, ముత్తాత అందరూ దేశాన్ని పాలించారన్నారు. ఇక రిమోట్ కంట్రోల్ పాలన అంటూ రాహుల్ చేసిన విమర్శలకు కూడా గట్టి జవాబిచ్చారు కేటీఆర్. మన్మోహన్ పాలనలో ఎవరు రిమోట్ కంట్రోల్ తో పాలించారో దేశ ప్రజలంతా చూశారన్నారు. సొంత గవర్నమెంటు తెచ్చిన ఆర్డినెన్సును అందరిముందూ చించేసిన సంస్కారం లేని రాహుల్ ఇక్కడికొచ్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తాము ఎవరికీ బీ, సీ టీమ్‌లము కాదని .. తెలంగాణలో తమదే ఏ టీం అని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల కోసం , వారి బాగుకోసం తాము ఎవరితోనైనా కొట్లాడతామన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. వారి పాలనలో ఆకాశం నుంచి పాతాళం దాకా దేన్నీ విడిచిపెట్టలేదన్నారు. కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్య, అసమర్థ పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను పక్కన కూర్చోబెట్టుకొని అవినీతిపై మాట్లాడితే సిగ్గుపోతుందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని... ఏం మాట్లాడుతున్నవో సోయితోని మాట్లాడాలన్నారు. కేసీఆర్ గనక నిజంగానే రాజులా పాలిస్తూ ఉంటే కారుకూతలు కూసే మీ పీసీసీ చీఫ్ బయట తిరుగుతుండేవాడా అని ప్రశ్నించారు కేటీఆర్. నెహ్రూ కాలం నుంచి పదవులు అనుభవిస్తున్న మీకు రాజరికం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ నియంత అయితే పొద్దున లేచి టీవీల్లో తిట్టే జర్నలిస్టుల ఆటలు సాగుతయా అని అన్నారు.
కేసీఆర్ ను క్షమించడానికి నువ్వేంది.. నీ లెక్కేందని రాహుల్ ను నిలదీశారు కేటీఆర్. అసలు ఔట్ డేటెడ్ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తరా అని ప్రశ్నించారు. సొంత సీట్లో గెలవని పీకుడుగాడు... ఇప్పుడేందో డిక్లరేషన్ అంటున్నాడని ఫైరయ్యాడు. నిలువెల్లా ఆరెస్సెస్ భావజాలాన్ని నింపుకున్న వ్యక్తిని పీసీసీ చీఫ్ చేసిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అన్నారు కేటీఆర్. గాంధీ భవన్ ను గాడ్సే చేతిలో పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ అభంశుభం తెలియని ఓ అమాయకుడు, అజ్ఞాని అని మండిపడ్డారు కేటీఆర్.
also read: Rahul Gandhi On Kcr: కేసీఆర్ పేరు ఉచ్చరించని రాహుల్.. అసహ్యమా!వ్యూహమా?
also read: Harish rao On Rahul: పంజాబ్ రైతులు ఈడ్చి తన్నారు.. రాహుల్ కు హరీష్ రావు కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.