కర్ణాటకలో ఏర్పాడిన రాజకీయ సంక్షోభంతో రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉంటూదా ..పడిపోతుందా అనే అంశం చర్చనీయంశంగా మారిన తరణంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు విశ్వాస పరీక్షకు అన్ని పక్షాల సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో ఒక వైపు బీజేపీ సభ్యలు ఈ రోజే విశ్వాసపరీక్ష జరగాలంటూ వాయిదాపడ్డ సభలోనే బీజేపీ నేతలు బైఠాయించి నిరసనలు తెలిపారు. మరోవైపు విశ్వాస పరీక్షకు మరికొంత గడువు ఇవ్వాలని కోరుతూ కర్ణాటక సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఓ లేఖ రాశారు. ముఖ్యంగా విన్నపాన్ని అంగీకరించిన  గవర్నర్... రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాంగ్రెస్-జేడీఎస్ లు వారి మెజార్టీ నిరూపించుకోవాలని సూచిస్తూ డెడ్ లైన్ విధించారు. 


ప్రస్తతం విశ్వాస పరీక్ష గట్టెక్కాలంటే ఆయనకు 105 మంది ఎమ్యెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం రామలింగారెడ్డి తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యే ఓటింగ్ కు గైర్హాజర్ కానున్నారు. ఈ మేరకు చూసుకుంటే బొటాబొటీగానైనా కుమారస్వామి విశ్వాస పరీక్ష గట్టెక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి కర్నాటక సీఎం కుమార స్వామి విశ్వాస పరీక్షను గట్టెక్కుతారా? కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలుపుకుంటుంది ? అనేది రేపు తేలిపోనుంది.