Narendra Modi Hotel Bill: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోటల్‌ అద్దె తీవ్ర రచ్చ రేపింది. బస చేసినందుకు మోదీ ప్రభుత్వం అద్దె చెల్లించలేదని హోటల్‌ యాజమాన్యం బయటపెట్టడంతో తీవ్ర దుమారం రేపింది. అయితే అద్దె అడిగిన హోటల్‌ యాజమాన్యానికి బెదిరింపులు రావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధాని బస చేసినందుకు గాను తాము అద్దె చెల్లిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మోదీ అద్దె చెల్లిస్తాననడం గమనార్హం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు


 


ప్రధాని మోదీ హోటల్‌ బస అద్దె విషయమై సోమవారం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే స్పందించారు. 'రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయం. కానీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమాన్ని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. అయినప్పటికీ ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది' అని తెలిపారు.

Also Read: Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌


ప్రాజెక్టు టైగర్‌ మొదలై 50 వసంతాలు పూర్తి చేసుకుని గతేడాది ఏప్రిల్‌ మైసూర్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి రూ.3 కోట్లు ఖర్చు అంచనా వేసినప్పటికీ అది రూ.6.33 కోట్లకు చేరుకుంది. ఈ కార్యక్రమం కోసం మైసూర్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మోదీ బస చేశారు. బస చేసినందుకు బిల్లు రూ.80 లక్షలు చెల్లించలేదు. ఏడాదవుతున్నా బిల్లు చెల్లించకపోవడంతో ఇటీవల కర్ణాటక అటవీ శాఖకు హోటల్‌ యాజమాన్యం గుర్తు చేసింది. బిల్లు చెల్లించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించడంతో వేగంగా పరిణామాలు మారాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter