Karnataka New Government: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కొత్త ప్రభుత్వం ఇవాళ కొలువుదీరింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నేతల సమక్షంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, తొలి కేబినెట్‌లో 8 మంది మంత్రులతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే 8 మంది సభ్యుల తొలి కేబినెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి కేబినెట్ కూర్పులో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కష్టపడినట్టు తెలుస్తోంది. అన్ని వర్గాలు, కులాలు, మతాలకు ప్రాతినిధ్యం కలిగేలా కేబినెట్ కూర్పు జరిగింది. ఇందులో ఏఐసీసీ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, లింగాయల్ నేతకు కూడా స్థానం లభించింది. 


8 మంది సభ్యుల తొలి కర్ణాటక తొలి కేబినెట్ ఇదే


ఎస్సీ సామాజికవర్గం నుంచి జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, క్రిస్టియన్ మైనారిటీ నుంచి కేజే జార్జ్, లింగాయత్‌ల నుంచి ఆ వర్గం నేత ఎంబీ పాటిల్, ఎస్టీ వాల్మీకి నుంచి సతీష్ జార్కిహోలి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, రెడ్డి సామాజికవర్గం నుంచి రామలింగారెడ్డి, మైనార్టీ ముస్లింల నుంచి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 


సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌‌లు శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఢిల్లీలోనే ఉండి పార్టీ అధిష్టానంతో కలిసి కేబినెట్ కూర్పుపై కసరత్తు చేశారు. ఎవరెవరిని తొలి కేబినెట్‌లో చేర్చుకోవాలి, ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే విషయాలపై చర్చించారు. 


ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఘండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. 


Also read: Two Thousand Notes : ఆర్బీఐ సంచలన నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook