karnataka news: ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయని వాగ్వాదం.. ఒకర్నిమరోకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు..
karnataka news: ఇటీవల కర్ణాటకలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బనాశంకరీకి చెందిన ఒక మహిళ తన కూతురుకు ఇంటర్ లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయంటూ ఆరా తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో ఇద్దరు నానా బూతులు తిట్టుకున్నారు.
Karntaka Mother Brutally Killed Daughter Over inter results dispute: ఇటీవల దేశంలో అనేక చోట్ల ఇంటర్, టెన్త్ ఎగ్జామ్ ల ఫలితాలు వెలువడ్డాయి. ఆయా రాష్ట్రాలలో ఇంటర్మీడియట్, టెన్త్ బోర్డులు ఈ ఫలితాలను విడుదల చేశాయి. ఇదిలా ఉండగా.. కొంత మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మరికొందరు విద్యార్థులు ఒకటి లేదా రెండు సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయ్యారు. ఇంకొంత మంది స్టూడెంట్స్ మాత్రం అన్ని సబ్జెక్ట్ లలో కూడా ఫెయిల్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడంను జీర్ణించుకోలేక దారుణాలు పాల్పడిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తమల్ని చూసి అందరు ఏమంటారో.. ఏవిధంగా కామెంట్లు చేస్తారో అంటూ చాలా మంది తీవ్రమైన ఓత్తిడికి గురయ్యారు. అంతేకాకుండా.. కొందరు తమ ఇంట్లో బలవన్మరణాలకు పాల్పడటం, గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి.
తెలంగాణలో ఇటీవల పదుల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. తల్లిదండ్రులు కూడా తమ పట్లు ఉంచుకున్న ఆశలను తీర్చలేమని, బాధతో విద్యార్థులు తమ వాళ్లకు కడుపు కోతను మిగిల్చి ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ ఎగ్జామ్ కాకుంటేమరో ఎగ్జామ్ లో పాస్ అవ్వోచ్చు.కానీ నిండు నూరేళ్ల జీవితంను ఇలా అర్థాంతరంగా ముగించుకోవడాన్ని చాలా మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఎగ్జామ్ లలో మార్కులు తక్కువోస్తే కోప్పడకుండా.. ఏం కాదులే అంటూ ధైర్యంచెబుతుంటారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా మార్కులు తక్కువొస్తే తాటతీస్తుంటారు. దీంతో పిల్లలుకొందరు మోండివాళ్ల మాదిరిగా మారిపోతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీ ఇంటర్ చదువుతుంది. ఇటీవల ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే. తన కూతురు మార్కుల విషయం ను ఇంట్లో వాళ్ల దగ్గర దాచిపెట్టినట్లు తల్లికి తెలిసింది. దీంతో తల్లి పద్మజ కోపంతో.. ఇంటర్ మార్కులపై ఆరాతీసింది. అంతేకాకుండా కూతుర్ని గట్టిగా నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తల్లి కోపంలో కిచెన్ లో ఉన్న కత్తి తీసుకుని, కూతుర్ని భయపెట్టడానికి ప్రయత్నించింది.
ఇక..కూతురు కూడా నాపైనే కత్తిని ఎత్తుతావా.. అన్నట్లు ఆమె కూడా కత్తితో తల్లిమీదకు వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురుకు తీవ్ర రక్త స్రావంకావడంతో అక్కడికక్కడే కుప్పకూలీపొయింది. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. గొడవలో..తల్లికి కూడా గాయాలు కావడంతో ఆమెను కూడా ఆస్పత్రిలో తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter