Karnataka Shocking Incident: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ యూనిఫాంలో మలవిసర్జన చేసినందుకు ఆగ్రహించిన ఓ స్కూల్ టీచర్ రెండో తరగతి బాలుడిపై అమానుష దాడికి పాల్పడ్డాడు. వేడి వేడి నీళ్లు బాలుడిపై కుమ్మరించడంతో తీవ్ర గాయాలతో ఆ చిన్నారి ఆసుపత్రిలో చేరాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సంతెకళ్లూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంతెకళ్లూరులో గణమాతేశ్వర గ్రామీణ సంస్థే ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైమరీ స్కూల్లో ఏడేళ్ల ఓ బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం (సెప్టెంబర్ 9) స్కూల్‌కు వెళ్లిన బాలుడు.. స్కూల్ యూనిఫాంలో మలవిసర్జన చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అతనిపై వేడి నీళ్లు కుమ్మరించాడు. 40 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


హులిగెప్ప అనే టీచర్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై తమకు సమాచారం ఉందని.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. విద్యాశాఖ పరిధిలోకి వచ్చే అంశం కావడంతో అక్కడి నుంచి ఫిర్యాదు అందితేనే కేసు నమోదు చేస్తామని చెప్పారు. మరోవైపు, బాలుడి తల్లిదండ్రులపై గ్రామ పెద్ద మనుషులు ఒత్తిడి తెచ్చి పోలీసుల దాకా వెళ్లకుండా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.


కొద్దిరోజుల క్రితం ఇదే కర్ణాటకలోని తూమకూరులో ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దుస్తుల్లో మూత్రం పోసుకున్నాడని ఆగ్రహించిన అంగన్‌వాడీ టీచర్ ఓ మూడేళ్ల దళిత బాలుడి జననాంగాలను కాల్చేసింది. రష్మీ అనే ఆ టీచర్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. అయితే ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బాధిత బాలుడి కుటుంబం పట్టుబడింది. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది.


Also Read: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..


Also Read: సీతారామం సినిమాలో తొమ్మిది మంది డైరెక్టర్లు... వారిని అబ్జర్వ్ చేశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook