Do You Know Nine Directors Acted in Sita Ramam Movie- Here is the List: ఆగస్టు నెలలో విడుదలైన సీతా రామం సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఒక హృద్యమైన ప్రేమ కావ్యంగా రూపొంది తెలుగు ప్రేక్షకులతో పాటు మలయాళ, హిందీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి టాలీవుడ్ కు ఆగస్టు నెలలో ఒక సూపర్ హిట్ అందించింది.
ఈ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మొత్తం తొమ్మిది మంది దర్శకులు నటీనటులుగా కనిపించారు. వారు ఎవరెవరు అంటే తరుణ్ భాస్కర్, అనీష్ కురువిల్లా, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, సందీప్ రాజ్, నీరజ్ కాబి, రాహుల్ రవీంద్రన్, రోహిణి, టిన్ను ఆనంద్.
ఇక ఆయా పాత్రల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో బాలాజీ అనే పాత్రలో కనిపించారు. సీతను వెతుకుతూ వచ్చిన అఫ్రీన్ పాత్రధారి రష్మిక మందనతో కలిసి తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. ఇక మద్రాస్ రెజిమెంట్ చీఫ్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు. ఆయన గతంలో అనేక సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించి ఇప్పుడు నటుడిగా మారారు. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ఆర్మీకి సంబంధించిన ఒక కీలక అధికారి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. ప్రకాష్ రాజ్ నటుడిగానే మనందరికీ తెలుసు.
కానీ ఆయన ఉలవచారు, మా ఊరి కథ లాంటి కొన్ని సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు. కాబట్టి ఆయన కూడా దర్శకుడిగానే చెప్పాలి. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఒకే ఒక సీన్లో కనిపిస్తారు హీరో హీరోయిన్లు చేయి పట్టుకునే సీన్లో ఆయన కనిపిస్తారు. ఇక తెలుగు నటుడు కొన్ని వెబ్ సిరీస్లను డైరెక్ట్ చేసిన అనీష్ కురువిల్లా కూడా ఒక కీలక పాత్రలో నటించారు. హీరోయిన్ పాత్రధారి మృణాల్ ఠాకూర్ ను ఒమన్ రాకుమారుడికి ఇచ్చి వివాహం చేసే ప్రతిపాదన అనీష్ కురువిల్లా పాత్రధారి తీసుకువస్తారు.
ఇక ఇక ఆఫ్రీన్ రష్మిక పాత్రధారికి తాను చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసే పాత్రలో నటుడు నీరజ్ కాబీ కనిపించారు. ఆయన ఒక థియేటర్ యాక్టర్ అలాగే డైరెక్టర్ కూడా. కనిపించింది ఒకే సీన్లో అయినా రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆయన కూడా గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక నటి రోహిణి కూడా ఈ సినిమాలో ఒకే ఒక సీన్ లో కనిపిస్తారు. ఆమె కూడా గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతో ఆమె కూడా ఈ సినిమాలో నటించిన దర్శకల జాబితాలో చేరారు.
ఇక రష్మిక లండన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళడానికి కారణం అయ్యే ఆనంద్ మెహతా అనే ఒక వ్యక్తి పాత్రలో టిన్ను ఆనంద్ నటించారు. ఆయన గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా ఈ సినిమాలో దర్శకుడు కాకుండా మొత్తం తొమ్మిది మంది దర్శకులు నటీనటులుగా కనిపించినట్లయింది.
Also Read: Assistant Director Died: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..
Also Read: Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి