కరుణానిధి ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న కావేరి ఆస్పత్రివర్గాలు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాయి. గడిచిన కొన్ని నుంచి కరుణానిధి ఆరోగ్యం మరింత విషమిస్తూ వస్తున్నట్టుగా ఆయనకు చికిత్స అందిస్తున్న కావేరి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో కరుణానిధికి చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తోందని డా. అరవిందన్ సెల్వరాజ్ ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ప్రస్తుతం కళైగర్ ఆరోగ్యం స్థిమితంగా లేదని కావేరి ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేయడంతో ఆస్పత్రి వెలుపల కరుణానిధి అభిమానులు ఆయన కోలుకోవాలని కోరుకుంటూ నినాదాలు చేయసాగారు. కావేరి ఆస్పత్రి వద్దకు కురణానిధి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటుండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలను భారీ సంఖ్యలో మోహరించింది.