Kasturba Gandhi Hospital Resident doctors protests: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) వ్యాపిస్తున్న కష్టకాలంలోనూ కరోనా నివారణ కోసం కరోనా పెషెంట్స్‌కి ( COVID-19 patients ) సేవలు చేసిన తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ ఢిల్లీలోని కస్తుర్భా గాంధీ హాస్పిటల్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ నిరసనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైద్యులు కొవ్వోత్తులు వెలిగించి తమ నిరసన తెలియచేశారు. నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ( NDMC ) పరిధిలోని హిందు రావు హాస్పిటల్, రాజెన్ బాబు టీబీ హాస్పిటల్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. గత మూడు, నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని, రోజులు తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని వైద్యులు వాపోయారు. తక్షణమే వేతనం బకాయిలు ( Pending salaries ) విడుదల చేయకపోతే సమ్మె తీవ్రతరం చేస్తామని వైద్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Also read : India Bans Import Of Air Conditioners: ఏసీల దిగుమతులపై భారత్ నిషేధం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైద్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ట్విటర్ ద్వారా స్పందించిన నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్.. '' డాక్టర్స్, నర్సులు, పారామెడిక్స్, సి, డి గ్రూప్ సిబ్బందికి ఇవాళ జీతాలు విడుదల చేశామని.. మిగతా వారికి కూడా త్వరలోనే చెల్లిస్తాం'' అని అన్నారు. ఇదే విషయమై మేయర్ జై ప్రకాశ్‌ని మీడియా వివరణ కోరగా.. జులై నెల జీతాలు చెల్లించినట్టు తెలిపారు. Also read : Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ సీనియర్ నేత ఆజాద్‌కు కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe