ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతగా నమోదు..
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 3.5 తీవ్రతగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 3.5 తీవ్రతగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ లోని రాజన్ పూరన్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Also Read: హీరోతో లవ్ మ్యారేజ్‌కు ‘టెన్త్ క్లాస్’ భామ రెడీ!
భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం స్థాన అక్షాంశాలు అక్షాంశం 28.7 N మరియు రేఖాంశం 77.2 E, లోతు 8 కి.మీ. ఉన్నాయని తెలిపింది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. భూ ప్రకంపనలు వచ్చాయని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ