హీరోతో లవ్ మ్యారేజ్‌కు ‘టెన్త్ క్లాస్’ భామ రెడీ!

లాక్ డౌన్ పూర్తయ్యాక హీరోయిన్ సునైనా పెళ్లిపీటలు ఎక్కనుందని, అది కూడా ప్రేమ వివాహమంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. Tenth Class fame Sunaina

Last Updated : Apr 12, 2020, 05:32 PM IST
హీరోతో లవ్ మ్యారేజ్‌కు ‘టెన్త్ క్లాస్’ భామ రెడీ!

దక్షిణాది యంగ్ హీరోయిన్ సునైనా మరోసారి వార్తల్లో నిలిచింది. లాక్ డౌన్ పూర్తయ్యాక సునైనా పెళ్లిపీటలు ఎక్కనుందని, అది కూడా ప్రేమ వివాహమని ప్రచారంలో ఉంది. ఆమె వివాహం చేసుకోయేది కోలీవుడ్ హీరో కృష్ణ కులశేఖరన్‌ను అని తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే కృష్ణ కులశేకరన్ (క్రేష్ణ)కు ఇది రెండో వివాహం. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

నటి సునైనా తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి ఆమెకు తొలి సినిమా. అయితే 2006లో వివాదాస్పదమైన టెన్త్ క్లాస్ సినిమాతో సునైనాకు గుర్తింపు లభించింది. 2007లో మిస్సింగ్ అనే మూవీ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు లేక తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో 2014లో విడుదలైన వన్మమ్ సినిమాలో నటించిన కృష్ణ కులశేఖరన్‌తో స్నేహం కుదరింది. ఈ పరిచయం ప్రేమగా మారింది . Pushpa ఫస్ట్ లుక్ ఫన్నీ మీమ్స్.. నీ మొలతాడ్లో నా తాయెత్తు!

Image Credit: Google.com 

అయితే సునైన పరిచయమైన సమయంలోనే క్రేష్ణ, హేమలతను వివాహం చేసుకున్నారు. అయితే వీరు తరచుగా గొడవలుపడేవారు. సునైనాతో ప్రేమ వ్యవహారం కారణంగానే గొడవలు జరిగేవని ఊహాగానాలున్నాయి. ఈ క్రమంలో 2016లో క్రేష్ణ, హేమలత విడాకులు తీసుకున్నారు. సునైనా, క్రేష్ణ మరింత దగ్గర కావడానికి ఇది ఓ కారణమైంది. ఇటీవల తన ప్రేమ విషయాన్ని సునైన కుటుంబసభ్యులకు చెప్పగా.. రెండో పెళ్లివాడ్ని ఎందుకు చేసుకుంటావని.. ఇందుకు ససేమిరా అన్నారట.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Image Credit: Google.com

కాగా, ఎలాగోలా సునైన ఇంట్లో వాళ్లను ఒప్పించిందని, తమపై వదంతులు చెక్ పెట్టేందుకు కృష్ణ కులశేఖరన్‌తో కలిసి ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకోవాలని సునైనా, క్రేష్ణ నిర్ణయం తీసుకోగా అంతలోనే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, దేశంలో పరిస్థితులు అంతగా సహకరించకపోవడంతో శుభకార్యం వాయిదా పడిందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. 

కెరీర్ విషయానికొస్తే.. తెలుగులో శ్రీవిష్ణుతో ‘రాజా రాజా చోళ’లో నటిస్తోంది. కోలీవుడ్‌లో ట్రిప్, ఎరియమ్‌ కన్నాడి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News