Kerala Assembly Elections Results Live Updates: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ అసెంబ్లీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎల్టీఎఫ్ మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందా లేదా యూడీఎఫ్ హస్తగతం చేసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు( Kerala Assembly Elections Results) వస్తున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం 633 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 6 వ తేదీన జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున 957 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు మొత్తం 11 వందల మంది పరిశీలకుల్ని నియమించింది ఎన్నికల సంఘం. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో అడుగు పెట్టాలంటే..కరోనా నెగెటివ్ లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. 


కేరళ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ( LDF) మరోసారి అధికారంలో వస్తుందనే అంచనాలకు తగ్గట్టుగానే ఎల్డీఎఫ్ ఆధిక్యం కనబరుస్తోంది. ఎల్డీఎఫ్ 89 స్థానాల్లోనూ, యూడీఎఫ్( UDF) 49 స్థానాల్లోనూ ఆధిక్యం కనబరుస్తున్నాయి. బీజేపీ ( Bjp) 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 
Also read: Assam Assembly Elections Results Live Updates: అస్సాం ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook