Kerala Blast: కేరళలోని కళామస్సేరీలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకేసారి 5 పేలుళ్లు జరిగాయని తెలుస్తోంది. మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో ఉన్న కళామస్సేరిలోని సమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఒక్కసారిగా ఐదు పేలుళ్లు జరిగాయి. ఓ మతపరమైన కార్యక్రమం సందర్భంగా దాదాపు 2 వేలమంది పాల్గొన్నట్టు సమాచారం. పేలుడుకు కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. ఈ పేలుళ్ల గురించి ఉదయం 9 గంటల సమయంలో సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఒకరు మరణించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాదాపు 40మంది వరకూ గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొచ్చి పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించారు. 


కేరళ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఛీప్, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీలను కొచ్చి చేరుకోవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసు యంత్రాంగం చుట్టుపక్కల జిల్లాల్నించి మరింతమంది పోలీసుల్ని రప్పిస్తున్నారు. సాంకేతీక కారణంతో పేలుడు జరిగిందా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. 


జిహోవా విట్నెస్ అనే కార్యక్రమం సందర్భంగా దాదాపు 2 వేలమంది హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు. అందరూ పరుగులు తీశారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం వరకూ కొనసాగాల్సి ఉంది. 


దాదాపు 108 ఆంబులెన్సులతో క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజ్ సిద్ధం చేశారు. కేరళ పేలుడు ఘటన నేపధ్యంలో కేరళలో ప్రత్యేక ఎలర్ట్ జారీ చేశారు. పబ్లిక్ ఈవెంట్స్‌కు ప్రత్యేక రక్షణ అవసరమని సూచించింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 


Also read: Mukesh Ambani: ముకేశ్ అంబానీకు మళ్లీ బెదిరింపు, 20 కాదు..200 కోట్లు చెల్లించాలని డిమాండ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook