'కరోనా వైరస్' ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి  నెలకొంది. వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్ డౌన్ కొనసాగుతుండడంతో .. ఇప్పుడు పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ మూతపడ్డాయి. దీంతో ఆర్ధిక వ్యవస్థ నానాటికీ దిగజారుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు  ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం.. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అధిక నిధులు వెచ్చించాల్సి రావడంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ క్రమంలో రాష్ట్రాలన్నీ నిధుల వేటలో పడ్డాయి. వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  


ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక  ప్రకటన చేశారు. ఏడాదిపాటు ప్రజా ప్రతినిధుల  జీతాల్లో 30  శాతం కోత విధిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ బోర్డుల సభ్యులు, స్థానిక సంస్థల్లో సభ్యుల జీతాల్లో నుంచి 30 శాతం కోత విధిస్తారు.  


ఇలా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి మిగేలే ఆదాయాన్ని కరోనా వైరస్ మహమ్మారిని పారదోలేందుకు వెచ్చించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..