ఆమెకు కరోనా లక్షణాల్లేవ్.. అయినప్పటికీ పరీక్షల్లో 19 సార్లు కరోనా పాజిటివ్..
ప్రపంచ వైద్య శాస్త్రానికే ముచ్చెమటలు పట్టించి సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంతా సులువుగా పారదోలే పరిస్థితి లేదంటున్నారు వైద్య నిపుణులు. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా
తిరువనంతపురం: ప్రపంచ వైద్య శాస్త్రానికే ముచ్చెమటలు పట్టించి సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంతా సులువుగా పారదోలే పరిస్థితి లేదంటున్నారు వైద్య నిపుణులు. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా చికిత్స అందిస్తున్నా ఫలితం కనిపించడంలేదని, ఇప్పటివరకు 19 సార్లు పరీక్ష చేయగా చేసిన ప్రతిసారి పాజిటివ్ అనే వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఆమె వయసు 62 సంవత్సరాలు ఉంటుందని ఇటలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల కారణంగా ఆమెకు కరోనా సోకగా, మార్చి 10న ఆసుపత్రిలో చేరిందని అన్నారు.
Also Read: Also read : Young talent: ఆర్జీవీని ఫిదా చేసిన సాంగ్.. క్రియేటివిటీ అద్భుతం
సుమారుగా 35 రోజుల నుండి వైద్య పర్యవేక్షణలో ఉన్నా ఆమెలో కరోనా వైరస్ మూలాలు కనిపిస్తూనే ఉన్నాయని, 19 పరీక్షల్లోనూ కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిందని అన్నారు. కరోనా లక్షణాలు ఆమెలో పెద్దగా బయటికి కనిపించడంలేదని, వైరస్ ను నిర్మూలించేందుకు అనేక రకాలుగా ఔషదాలు వాడుతున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదని డాక్టర్ ఎన్.షీజా తెలిపారు.
Read Also: Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య
మరోవైపు ఇదే అంశాన్ని రాష్ట్ర మెడికల్ బోర్డుకు కూడా నివేదించామని, ఆమెకు ఇతర వ్యాధులేవీ లేవని, కరోనా లక్షణాలేవీ బయటికి కనిపించకపోయినా, ఇతరులకు వ్యాపింప చేస్తుందని వివరించారు. తరవాత పరీక్షలోనూ కరోనా పాజిటివ్ వస్తే ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తామని డాక్టర్ షీజా తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..