Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,329 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో మరో 44  మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Last Updated : Apr 22, 2020, 01:08 AM IST
Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,329 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో మరో 44  మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు గుర్తించిన పాజిటివ్ కేసులు కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 18,985 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. అందులో 15,122 మంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3,259 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 603కి చేరింది. 

Also read : Young talent: ఆర్జీవీని ఫిదా చేసిన సాంగ్.. క్రియేటివిటీ అద్భుతం 

ఇదిలావుంటే, నేడు సాయంత్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్స్‌లో అవసరాలకు తగిన విధంగా నిల్వలు ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచించారు. రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి తరచుగా రక్తమార్పిడి అవసరం కనుక వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News