Kerala Court Verdict: కేరళ కోర్టు సంచలన తీర్పు.. అత్యాచార నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష..
Kerala Court Verdict: కేరళ కోర్టు అత్యాచార బాధితుడికి సంచలన తీర్పువెలువరించింది. అత్యాచారం చేసిన నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా..ఆ వ్యక్తికి ₹ 60,000 జరిమానా కూడా విధించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
kerala pocso court sentences man to 106 years jail term for repeaedly raping: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకోసం ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చినకూడా కామాంధులు మాత్రం మారడంలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆఫీసులు,ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. అంతేకాకుండా.. కొన్నిచోట్ల మహిళలు, అమ్మాయిలు ఇంట్లో వారి నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారు. బాధితులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే అక్కడ కూడా వేధింపుల ఘటనలు ఎదురౌతున్నాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతులను లైంగికంగా వేధిస్తుంటారు. మరికొన్ని చోట్ల ఇంట్లో కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు కూడా వేధింపులకు పాల్పడుతుంటారు. సోదరులు, తండ్రులు, తమ పిల్లలను కూడా లైంగికంగా వేదించిన ఘటనలు అనేకం జరిగాయి.
అంతేకాకుండా..కొందరు మరీ పైశాచీకంగా రోడ్డుపక్కల ఉండే మతిస్థిమితం లేని వారినికూడా వేధించి, లైంగికంగా వేధిస్తుంటారు. నోరులేని జీవాలను సైతం కొందరు వదలడంలేదు.కుక్కలు, గేదెలు,ఆవులపై కూడా అత్యాచారం జరిపిన కామాంధులు ఘటనలు మనం గతంలో అనేకం చూశాం. అయితే.. ఒక మతిస్థిమితంలేని యువతిని అత్యాచారం జరిపిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
కేరళలోని ఇడుక్కిలో అమానవీయకర సంఘటన జరిగింది. ఈ పర్వత జిల్లాలో 15 ఏళ్ల మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు. కేసును విచారించిన పోక్సోకోర్టు.. 44 ఏళ్ల వ్యక్తికి కేరళ కోర్టు సోమవారం 106 ఏళ్ల జైలు శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా.. జైలు శిక్షల్లో అత్యధికంగా 22 సంవత్సరాలు, అతను 22 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టంచేసింది. జైలు శిక్షతోపాటు.. కోర్టు ఆ వ్యక్తికి ₹ 60,000 జరిమానా కూడా విధించింది. దోషి జరిమానా మొత్తాన్ని చెల్లించకుంటే అదనంగా 22 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిందితుడు జరిమానా చెల్లిస్తే, ఆ మొత్తాన్ని ఇడుక్కి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన బాధితుల పరిహార పథకం నుంచి బాలికకు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
2022లో త్రిసూర్‌కు చెందిన నిందితుడు పని నిమిత్తం ఆదిమాలికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అతను ఒక హోటల్‌లో అమ్మాయి తల్లితో కలిసి పని చేసేవాడు. ఆమెతో మంచిగా ఉండటంతో ఆమె అతనికి ఆవాసం ఇచ్చింది. ఆ తర్వాత బాలిక తల్లి, తోబుట్టువులు ఇంట్లో లేని సమయంలో నిందితులు అమాయక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనలను బయటపెడితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. కొన్నిరోజుల తర్వాత బాలిక శరీరంలో తల్లి మార్పులు గమనించింది.
వెంటనే బాలికను ఆదిమాలి తాలూకా ఆసుపత్రికి తీసుకురాగా, బాలిక గర్భవతి అని వైద్యుడు గుర్తించడంతో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బాలికకు టెస్టులు చేశారు. దీంతో ఘటన వెనుక దారుణం తెలిసిపోయింది. గర్భస్రావం చేయబడిన బాలిక, నిందితుడి పిండం యొక్క వైద్య నమూనాలను DNA పరీక్షలు నిర్వహించగా, బాలికకు పుట్టబోయే బిడ్డ తండ్రి నిందితుడని తేలింది. దీంతో కోర్టు అతగాడిని నిందితుడికిగా పరిగణించి కఠినంగా శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter