Kerala Omicron cases: కేరళలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇక్కడ 44 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron cases in Kerala) 107కి పెరిగినట్లు తెలిపారు. అనుమానిత శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్​కు పంపుతున్నట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా కేరళలో గురువారం ఒక్క రోజే (Corona cases in Kerala) 2,423 కరోనా కేసులు, 164 మరణాలు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,32,672కు చేరింది.


ఎర్నాకులంలో అత్యధికంగా 455 కేసులు, తిరువనంతపురంలో 416 కేసులు, కోజికోడ్​లో 266 కేసులు నమోదైనట్లు తెలిపింది ప్రభుత్వం.


రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఇలా..


రాష్ట్రంలో ఇప్పటి వరకు 98 శాతం అర్హులకు మొదటి డోసు కరోనా టీకా ఇచ్చినట్లు వీణా జార్జ్​ వెల్లడించారు. 79 శాతం అర్హులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వివరించారు.


కొవిడ్ భయాలతో కర్ఫ్యూ..


రాష్ట్రంలో కరోనా కేసుల్లో వృద్ధి, ఒమిక్రాన్ వ్యాప్తి భయాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ (Night Curfew in Kerala) విధించింది. కొత్త సంవత్సరం వేడుకల్లో కరోనా వ్యాప్తి పెరగకుండా.. చర్యలు చేపట్టింది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.


ఇతర రాష్ట్రాల్లోను భయాలు..


దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో దాదాపు సగం ఇక్కడే ఉండటం ఆందోళనకరమైన విషయం. ఈ రాష్ట్రంలో మొత్తం 450 ఒమిక్రాన్​ కేసులు ఉన్నాయి.


Also read: Omicron scare: దేశంలో ఒమిక్రాన్ కలవరం- రాజస్థాన్​లో ఓ వ్యక్తి మృతి!


Also read: Pondicherry Night curfew : పాండిచ్చేరిలో అదొక్క రోజు తప్ప జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook