Kerala: ఐదు రోజులు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ( Ayyappa Swamy Temple ) నేటినుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనున్నది. కరోనా లాక్‌డౌన్ నాటి నుంచి ఆలయాన్ని మూసివేశారు.
Ayyappa Swamy Temple reopens: న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ( Ayyappa Swamy Temple ) నేటినుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనున్నది. కరోనా (Coronavirus) లాక్‌డౌన్ నాటి నుంచి ఆలయాన్ని మూసివేశారు. అయితే చింగం మాసం పూజల కోసం సోమవారం ఉదయం ఆలయాన్ని తెరిచారు. ఈ రోజు ఉదయం పూజలు ప్రారంభమై ఈనెల 21సాయంత్రం వరకు జరగనున్నాయి. 21సాయంత్రం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ( Travancore Devaswom Board ) తెలిపింది. అయితే కోవిడ్19 నిబంధనలు దేవస్థానం కచ్చితంగా పాటిస్తుందని బోర్డు స్పష్టంచేసింది. ఈ ఐదు రోజులు భక్తులకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే తర్వాత ఆలయాన్ని తెరిచినా.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భక్తులను అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. Also read: India: 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
మలయాళం కొత్త సంవత్సరం చింగం నెల ప్రారంభం సందర్భంగా ఆగస్టు 17న అయ్యప్ప ఆలయాలను ఐదు రోజులపాటు తెరవాలని ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ తరువాత మళ్లీ ఓనమ్ పూజల కోసం శబరిమల ఆలయాన్ని ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 2వరకు తెరవనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇదిలాఉంటే... నవంబరు 16న శబరిమల వార్షిక ఉత్సవాలు మొదలు అవుతాయని శబరిమల దేవస్థానం అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. ఈ ఉత్సవాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని.. కోవిడ్ నిబంధనలతో వాటిని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. Also read: Neeli Neeli Aakasam Song: 'నీలి నీలి ఆకాశం' మరో రికార్డ్