Ticket Inspector Sindhu: దేశంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవం ఉండం చాలా తక్కువ. వారిని సమాజం చిన్నచూపు చూస్తుంటుంది. కానీ వారు మనుషులేననే వాస్తవం గ్రహించారు. శారీరక లోపంతో జన్మించిన వారికి ప్రోత్సహిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలా ఓ హిజ్రా కష్టపడి చదివి రైల్వే శాఖలో కీలకమైన ఉద్యోగాన్ని సాధించారు. రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క


కేరళలోని నాగర్‌కోవిల్‌కు చెందిన సింధు 19 ఏళ్ల కిందట రైల్వే ఉద్యోగిగా చేరారు. ఎర్నాకుళంలోని రైల్వే శాఖలో తొలి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం తమిళనాడులోని దిండుక్కల్‌కు బదిలీ అయ్యారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో ఆమె చేయికి తీవ్ర గాయమైంది. దీంతో వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందని సింధు ఆ ఉద్యోగం చేస్తూనే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. 

Also Read: YS Sharmila Security: చెల్లెమ్మకు భద్రత పెంచిన జగన్‌ అన్నయ్య.. 2+2 భద్రత పెంపు


శిక్షణలో ప్రతిభ కనిపించిన సింధును దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఇటీవల సింధు టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక ట్రాన్స్‌జెండర్‌ రైల్వే శాఖలో అత్యున్నత ఉద్యోగం సాధించడం విశేషం. ఈ ఉద్యోగానికి ఎంపికవడంతో సింధు దక్షిణ భారతదేశంలో తొలి రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా రికార్డు నెలకొల్పారు.


ఈ ఉద్యోగం సాధించిన సింధును అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ 'నేను హిజ్రా కావడంతో ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం ఉండేది. కానీ తర్వాత కష్టపడి ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. విద్యతోపాటు కష్టపడి పని చేస్తే ఉన్నత స్థాయికి స్థిరపడవచ్చు' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook