ఫ్రాన్స్ గెలిస్తే ..అది మన విజయమా ?.. వివాదాస్పదంగా మారిన కిరణ్ బేడి ట్వీట్
ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే . అయితే ఫ్రాన్స్ విజయం పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీకి కష్టాలు తెచ్చిపెట్టింది..ఎలగెలగా..ఇదెలా సాధ్యమనుకుంటున్నారా..అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.
గత రాత్రి ఫ్రాన్స్ జట్టు పుట్ బాల్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కిరణ్ బేడీ స్పందిస్తూ "మేము పుదుచ్చేరియన్లం. ప్రపంచ కప్ గెలుచుకున్నాం. అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు. ఇదే అంశం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా పుదుచ్చేరి ఒకప్పుడు ఫ్రెంచ్ భూభాగంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఫ్రాంచ్ విజయాన్ని మన విజయంగా చెబుతూ ట్వీట్ చేశారు... ఈ రకమైన ట్వీట్ చేసినందుకు కిరణ్ బేడీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది
కిరణ్ బేడీ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ... ముందు మనం భారతీయులమని..ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపాలంటూ పలువురు సురకలు అంటించారు.. మరి కొందరైతే ఈ ట్వీట్ పై ఎగతాళి చేయడం మొదలెట్టారు.. ఫ్రాన్స్ జట్టు విజయాన్ని పుదుచ్చేరియన్ల విజయంగా ఆమె అభివర్ణించడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు.