Kiren Rijiju Accident: కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు
Kiren Rijiju Car Accident In Jammu Kashmir: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రయణిస్తున్న కారును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రంబన్ జిల్లా బనిహాల్ ప్రాంతం సమీపంలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
Kiren Rijiju Car Accident In Jammu Kashmir: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రంబన్ జిల్లా బనిహాల్ ప్రాంతం సమీపంలో శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. మంత్రి కారు పాక్షికంగా దెబ్బతినగా.. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది వెంటనే మంత్రి కారు వద్దకు వచ్చారు. మంత్రిని కారు నుంచి సురక్షితంగా కిందకు దింపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కేంద్రమంత్రి కారుకు ప్రమాదం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. మంత్రి రిజిజు కారు స్వల్ప ప్రమాదానికి గురైందని రాంబన్ పోలీసులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. మంత్రిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చామన్నారు. మంత్రి కారును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. డోగ్రీ భాషలో భారత రాజ్యాంగం మొదటి ఎడిషన్ జమ్మూ విశ్వవిద్యాలయంలో విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంతి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: RR vs DC Highlights: ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమి.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్
జమ్మూ రోడ్లను ఆస్వాదిస్తూ కారులో ప్రయాణం చేస్తున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు.. ఇవాళ ఉదయమే ట్విట్టర్‌లో వీడియో కూడా పోస్ట్ చేశారు. 'ఉదంపూర్ నుంచి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ గుండా వెళుతున్నా. దేశంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే హైవే అభివృద్ధి కోసం ఇక్కడ కూడా భారీ నిర్మాణం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడడం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నాయి..' ఆయన రాసుకొచ్చారు. ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చంటూ వీడియోలను కూడా షేర్ చేశారు. ఆయన వీడియోలను పంచుకున్న కొద్దిసేపటికే ప్రమాదం జరగడం గమనార్హం.
జమ్మూ యూనివర్శిటీ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ రిజజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నిరాశ నెలకొందని.. న్యాయ వ్యవస్థపై దాడి చేస్తోందన్నారు.
Also Read: IPL 2023 Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook