Rajasthan Royals Won by 57 Runs Vs Delhi Capitals: రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 57 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇంది రెండో విజయం కాగా.. ఢిల్లీ జట్టుకు వరుసగా మూడో ఓటమి. ఈ గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఢిల్లీ చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్‌లో మూడో బంతికే డకౌట్ అయ్యాడు. తరువాత బంతికే సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మనీష్ పాండే కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. మళ్లీ కోలుకోలేకపోయింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్, రిలీ రోసౌ మూడో వికెట్‌కు 36 పరుగులు జోడించి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. రోసౌ (14) ఔట్ అయిన తరువాత లలిత్ యాదవ్ (38)తో కలిసి వార్నర్ జట్టును ఆదుకున్నాడు. నాల్గో వికెట్‌కు ఇద్దరు 64 పరుగులు జోడించిన అనంతరం లలిత్ యాదవ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత రాజస్థాన్ బౌలర్లు చెలరేగారు. వరుస విరామల్లో వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ (2), రోవ్‌మన్ పావెల్ (2), అభిషేక్ పారెల్ (7) విఫలయ్యారు. వార్నర్ (55 బంతుల్లో 65, 7 ఫోర్లు) క్రీజ్‌లో పాతుకుపోయినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరికి చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు, సందీప్ శర్మ ఒకట వికెట్ పడగొట్టారు.
Also Read: Anushka Sharma To Vini Raman: బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్.. వారి లైఫ్ పార్ట్‌నర్స్ ఫోటోలు
అంతకుముందు టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, జైస్వాల్ మెరుపు వేగంతో శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు మంచి పునాది వేశారు. యశస్వి 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 60 పరుగులు చేయగా.. బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 79 పరుగులు చేశాడు. హెట్‌మేయర్ 21 బంతుల్లో 39 పరుగులతో రాణించాడు. చివరికి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా.. కుల్దీప్, రోవ్‌మన్ పావెల్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read: IPL 2023 Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి