BJP New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్, సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు
Kishan Reddy And Daggubati Purandeswari Elected Bjp New Presidents: తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ సారథులు వచ్చారు. తెలంగాణకు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని ఎంపిక చేయగా.. ఏపీకి సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని అధిష్టానం ఎంపిక చేసింది.
Kishan Reddy And Daggubati Purandeswari Elected Bjp New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్, సోము వీర్రాజులను తొలగించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించగా.. బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి సమాచారం అందించారు. మీ టర్మ్ అయిపోయిందని.. రాజీనామా చేయాలని నడ్డా సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్‌తో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు చెప్పారు. బండి సంజయ్‌కు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ అధ్యక్షుడిగా సత్యకుమార్‌ను నియమించారని మొదట ప్రచారం జరిగింది. కానీ పురంధేశ్వరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. మంగళవారం సాయంత్రం కొత్త అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణలో ఈటల రాజేందర్‌కు, ఏపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ప్రమోషన్ లభించింది. తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. అదేవిధందా ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల మార్పు జరిగింది. ఝార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ చీఫ్‌గా సునీల్ జాఖఢ్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 2009లో విశాఖ నుంచి రెండోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. యూపీఏ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2014లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా పనిచేశారు. బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 మధ్య తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతుండగా.. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ నాయకత్వం మరోసారి అధ్యక్షుడి నియమించింది.
Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook