కేబినెట్‌లో కిషన్ రెడ్డికి దక్కిన పదవి ఇదే
కేబినెట్‌లో కిషన్ రెడ్డికి దక్కిన పదవి ఇదే
హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపిగా ఎన్నికైన గంగాపురం కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. నేడు కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి బాధ్యతలు అప్పగించారు. లోక్ సభలో అడుగుపెట్టిన తొలిసారే కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకోవడంపై తెలంగాణ బీజేపి నేతలు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు లభించడంపై సంబరాలు జరుపుకున్నారు.
ఇదిలావుంటే, తొలిసారిగా లోక్ సభలో అడుగుపెట్టిన అమిత్ షాకు మొట్టమొదటి అవకాశంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన అమిత్ షా.. తన ప్రత్యర్థిపై 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.