Pro-Pakistan Slogans: మనదేశంలో పాకిస్థాన్‌ అనుకూల శక్తులకు కర్ణాటక మంత్రి తీవ్ర హెచ్చరిక చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే.. మద్దతు తెలిపే వాళ్లను కాల్చి చంపేయాలి' అని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. తమ పార్టీ కార్యకర్త ఒకరు నినాదం చేయడంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. అతడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై స్పందిస్తూ కర్ణాటక మంత్రి కేఎన్‌ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసే వారిని కాల్చి చంపాలి' అని కేఎన్‌ రాజన్న తెలిపారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం


ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఫిబ్రవరి 27వ తేదీన ఓ కార్యక్రమం జరిగింది. విజయం సాధించిన ఆనందంలో ఓ కార్యకర్త 'జై పాకిస్థాన్‌' అనే నినాదాలు చేశాడు. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. రాష్ట్ర శాసనసభలో ప్రత్యర్థి దేశం అనుకూల నినాదాలు జరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. వారిపై కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌లు వచ్చాయి. ఈ వివాదం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్ర రచ్చ లేపింది. పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది.

Also Read: IBA Hike: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్‌.. భారీ మొత్తంలో పెరగనున్న జీతాలు.. శనివారం కూడా సెలవు?


ఈ క్రమంలోనే ఆ పరిణామంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మంత్రి కేఎన్‌ రాజన్న స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇమేజ్‌ బాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే మరింత పెరిగింది. ఎవరైనా నినాదాలు చేసినా.. పాకిస్థాన్‌కు మద్దతు పలికినా ఆ వ్యక్తిని కాల్చి చంపండి. అందులో ఏమాత్రం తప్పులేదు' అని పేర్కొన్నారు. ఇక యూపీలో జరుగుతున్న బుల్డోజర్‌ పాలనను రాజన్న వెనుకేసుకురావడం గమనార్హం. 'దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లతో శాంతిభద్రతను పర్యవేక్షించారు. యూపీలో ఇల్లు కూల్చారు. ఇది చట్టంలో లేదు. కానీ బుల్డోజర్లతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయా? లేదా? మరి దాన్నెందుకు తప్పుబడతారు' అని ప్రశ్నించారు. 


కాగా ప్రత్యర్ధి దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ఉదంతంలో ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ పేరును కూడా కేసులో పొందుపర్చాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు అతడిని రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వీలు కల్పించవద్దని బీజేపీ నాయకులు ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖర్‌ను విజ్ఞప్తి చేశారు. 'ఆ ఘటనతో ఇది కన్నడిగులు, ప్రతి భారతీయుడినీ అవమానించడమే' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter