Oxygen Supply: దేశమంతా కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలవుతోంది. రోజురోజుకూ భయంకరరూపం దాలుస్తోన్న కరోనా వైరస్  కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆక్సిజన్ అందక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ స్టీల్‌ప్లాంట్లే దేశానికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కరోనా వైరస్(Corona virus) విలయతాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రకంపనల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. ప్రతిరోజూ 3 లక్షలు దాటి కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ కొరత(Oxygen Shortage) , మరోవైపు బెడ్స్, మందుల కొరత వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ లేక రోగులు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో దేశీయంగా ఉన్న వివిధ స్టీల్‌ప్లాంట్లే దేశానికి కావల్సిన ఆక్సిజన్ సరఫరా( Oxygen supply from steel plants) చేస్తున్నాయి. అందులో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒకటి.


దేశంలోని వివిధ స్టీల్‌ప్లాంట్లు కరోనా చికిత్స కోసం వివిధ రాష్ట్రాలకు 2020 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1.43 లక్షల టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా (Oxygen Supply) చేశాయి. శనివారం ఒక్కరోజే 3 వేల 474 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశాయి. దేశీయంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టీల్‌ సెక్టార్‌లో మొత్తం 33 ఆక్సిజన్‌ ప్లాంట్‌లు ఉండగా 29 ప్లాంట్‌లు ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి. వీటి రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 2 వేల 834 టన్నులు కాగా ఈ నెల 24న సామర్థ్యానికి మించి 3 వేల 474 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశాయి. ఆయా ప్లాంట్లలో నైట్రోజన్, ఆర్గాన్‌ల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఇది సాధ్యమైంది.


ఏప్రిల్ 24 వ తేదీన 2 వేల 894 టన్నుల ఆక్సిజన్ వివిధ రాష్ట్రాలకు సరఫరా అయింది. గతంలో రోజువారీ సరఫరా 15 వందల టన్నుల నుంచి 17 వందల టన్ను వరకూ ఉండేది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SAIL) రోజుకు  8 వందల టన్నులు సరఫరా చేస్తుండగా ఈ నెల 23వ తేదీ ఒక్కరోజునే 1150 టన్నులు, 24వ తేదీన 960 టన్నులు సరఫరా చేసింది. ఇక ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ (Visakha Steel Plant) ఏప్రిల్ 13 నుంచి ఇప్పటి వరకూ 13 వందల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది.


Also read: India Covid-19 Cases: కరోనా ఎఫెక్ట్, భారత్‌ నుంచి విమానాలపై మరో దేశం నిషేధం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook