Kolkata junior doctor murder case: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం  ఘటనకు వ్యతిరేకంగా ఇప్పటికి కూడా కొంత మంది జూనియర్ వైద్యులు నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీబీఐ కూడా చార్జీ షీట్ ను దాఖలు చేసింది. దీనిలో  కేవలం సంజయ్ రాయ్ మాత్రమే అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా చార్జీషీట్ లో దాఖలు చేసింది. గ్యాంగ్ రేప్ జరగలేదని చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే..  ఇటీవల కొంత మంది వైద్యులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. జూనియర్ వైద్యురాలికి సరైన న్యాయం జరగలేదని నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు, జూనియర్ వైద్యులకు సెఫ్టీగా పోలీసులు ఉండాలని కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఈ రోజు సీనియర్ వైద్యులు,  జూనియర్ డాక్టర్లను పరామర్శించి తమ మద్దతు తెలియజేశారు.ఈ నేపథ్యంలో సీనియర్ డాక్టర్లు 50 మంది రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆగస్టు 9 న జూనియర్ డాక్టర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశంలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి.


సుప్రీంకోర్టు సైతంఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుంది. యువతిని అత్యంత దారుణంగా హింసించి, అత్యాచారం చేసి హత్య చేశారని పోస్టు మార్టం రిపోర్టులో డాక్టర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. యువతి అంతర్గంత ఎముకలు విరిగిపోయి ఉండటం, యువతి శరీరంలో భారీగా సెమెన్ ఉండటంను బట్టి యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోస్టు మార్టం రిపోర్టులో వైద్యులు తెలిపారు.


Read more: Kolkata Doctor murder case: కోల్ కతా డాక్టర్ కేసులో మరో సంచలనం.. నేరం చేసింది ఒక్కడే.. చార్జీ షీట్ దాఖలు చేసిన సీబీఐ..


కానీ సీబీఐ మాత్రం దీనికి భిన్నంగా కేవలం ఒక్కరే చేశారని, గ్యాంగ్ రేప్ కాదని చార్జీషీట్ దాఖలు చేయడం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కావాలనే కేసును కొంత మంది తప్పుదొవ పట్టిస్తున్నారని కూడా దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి