Kolkata Doctor murder case: కోల్ కతా డాక్టర్ కేసులో మరో సంచలనం.. నేరం చేసింది ఒక్కడే.. చార్జీ షీట్ దాఖలు చేసిన సీబీఐ..
Rg kar case: కోల్ కతా డాక్టర్ అత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 న జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
cbi filed charge sheet on doctor murder case: పశ్చిమ బెంగాల్ లో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 9 న ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ విగత జీవిగా కన్పించింది. దీంతో ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. సుప్రీంకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో పలుమార్లు దీనిపై విచారణ జరిపింది.
తొలుత పోలీసులు చేసిన దర్యాప్తుపై అనుమానాలు ఉండటంతో.. దీనిపై కోల్ కతా కోర్టు సీబీఐ ను ఏర్పాటు చేసింది. యువతిపై గ్యాంగ్ రేపు జరిపి.. అత్యంత క్రూరంగా హతమార్చినట్లు కూడా వార్తలు పోస్టు మార్టం రిపోర్టులో డాక్టర్లు వెల్లడించారు. యువతి గొంతు ఎముక చిట్లిపోయి, యువతి శరీరంలో సెమెన్ కూడా ఎక్కువగా ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో బైటడిపడింది.
గ్యాంగ్ రేపు చేసి అత్యంత దారుణంగా హతమార్చారని యువతి తల్లిదండ్రులు, జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై డాక్టర్లు మాత్రం నిరసనలు కొనసాగించారు. అయితే.. తాజాగా, దీనిపై సీబీఐ తన చార్జీషీట్ ను కోర్టు వారి ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు..
ఆర్జీకర్ ఘటన దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీబీఐ తాజాగా, తన తొలి చార్జీషీట్ ను కోర్టుఎదుట దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో ముఖ్యంగా యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని, కేవలం సంజయ్ రాయ్ మాత్రమే అత్యాచారం చేశాడని తెల్చిచెప్పింది. అంతేకాకుండా.. ఘటనకు కొన్ని గంటల ముందు అతను సెమినార్ హాల్ లో డాక్టర్ ను గమనిస్తున్న వీడియో వైరల్గా మారింది.
అంతేకాకుండా.. అతని గోర్లు, వెంట్రుకలు, సెమెన్ టెస్టులలో బాధిత యువతి దగ్గర దొరికిన ఆనవాళ్లతో సరిపోలాయి. దీంతో సంజయ్ రాయ్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడినట్లు సీబీఐ తన చార్జీషీట్ లో వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఘటన జరగ్గానే.. నిందితుడు.. బ్లూటూత్ యువతి చనిపోయిన సెమినార్ హాల్ లో లభ్యం కావడంతో.. సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు.ఆతర్వాత దీనికి ఆర్జీకర్ ఆస్పత్రి ప్రిన్స్ పాల్ సందీప్ ఘోష్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది మాత్రం సీబీఐ తన చార్జీషీట్ లో స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి