Kolkata doctor rape and murder: ఆర్తనాదాలు పెడుతున్నా.. వారి మనసు కరగలేదా.. సెమినార్ హాల్ నుంచీ శబ్దాలు వినిపించలేదా..?
Kolkata doctor rape case shocking details: కలకత్తాలో జరిగిన దారుణమైన ఘటన.. భారతదేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక డాక్టర్ ని అత్యంత దారుణంగా రేప్ చెయ్యడంతో.. తనకు న్యాయం జరగాలని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసనలు తెలుపుతోంది. ఈ క్రమంలో ఈ కేసు గురించి.. రోజుకొక షాకింగ్ విషయం బయటపడి.. అందరినీ మరింత కదల్చి వేస్తోంది.
Kolkata doctor rape case shocking revelations: కలకత్తా ఉదంతం.. దేశాన్ని అట్టుడికిస్తున్న ఘటన.. ప్రాణం పోయాల్సిన డాక్టర్ని అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి హతమార్చారు.. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తుంటే దేశం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
ముఖ్యంగా జూనియర్ డాక్టర్ పై హత్యాచారం.. ఎవరిని అంత త్వరగా మర్చిపోయాలా చేయడం లేదు. గొంతు మెడ విరిచేసి.. అరవకుండా గొంతు నొక్కేసి , అత్యంత దారుణంగా చిత్రవధ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్ళు, ముక్కు నుంచి రక్తం కారిందని , ఆమె గర్భంలో 150 ml సెమెన్ ఉంది అని వార్తలు సోషల్ మీడియాలో రావడంతో.. ఈ విషయాలు కాస్త అందరిని మరింత బాధకు, ఆగ్రహానికి గురిచేశాయి. ఇక ఇది ఒకరు చేసింది కాదు సామూహిక హత్యాచారం అంటూ ఒక డాక్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మరికొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తుంటే.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలోని ఆర్ జి కర్ వైద్య కళాశాలలో.. జూనియర్ వైద్యురాలి పై హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తు చేపడుతున్న సిబిఐ పలు కీలక అంశాలను వెల్లడించింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసులో విచారణ చేస్తున్న.. సిబిఐ రోజుకు ఒక కీలక అంశాన్ని వెల్లడిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా మరో విషయాన్నీ తెరపైకి తీసుకువచ్చింది.
అందులో భాగంగానే సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పనిచేయడం లేదని , తమ విచారణలో బయటపడినట్లు సిబిఐ వెల్లడించింది. ముఖ్యంగా బాధితురాలని సెమినార్ హాల్లో చిత్రహింసలు పెడుతున్నప్పుడు , ఆ సమయంలో హాల్ లోపలి నుంచి వచ్చిన శబ్దాలు బయట ఎవరికి ఎందుకు.. వినిపించలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది సిబిఐ. నిజానికి సెమినార్ హాల్లో చిన్నగా మాట్లాడిన సరే వస్తువులు ఉండవు కాబట్టి శబ్దాలు గట్టిగా వస్తాయి. అలాంటి ఆమె ఆర్ధనాథాలు పెడుతూ కేకలు వేస్తున్నా.. ఎందుకు బయట వారికి వినిపించలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోయింది.పైగా నేరం జరుగుతుండగా ఎవరు లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట ఎవరైనా నిల్చొని సహకరించారా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు సిబిఐ వెల్లడించింది . అంతేకాదు ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిసిటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా బాధితురాలని చిత్రహింసలు పెడుతున్న సమయంలో వచ్చిన శబ్దాలు ఎవరికీ వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కూడా తెలిపింది.
ఇకపోతే గొల్లం పనిచేయకపోవడం గురించి ఇంటర్న్ లు, జూనియర్ డాక్టర్ సిబ్బంది తమ విచారణలో బయటపెట్టినట్లు సిబిఐ వెల్లడించింది. దీంతో బోల్ట్ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీసాయి. అంతేకాదు కేసుకు సంబంధించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను కూడా శుక్రవారం సిబిఐ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇతడిని నిర్ధాక్షణంగా ఉరి తీయాలి అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. మరి అతడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also Read: YS Jagan: తొలిసారి జగన్ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి
Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter