Kolkata doctor case: ఎగ్ నూడుల్స్ కావాలి- జైలు భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్ రాయ్!
Kolkata Doctor Rape Case: ఈ మధ్యనే కోల్‌కతా లోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన రేప్ మర్డర్ కేస్ గురించి అందరికీ తెలిసిందే. డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేసిన కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకి వెళ్లిన సంజయ్ రాయ్ ఇప్పుడు జైలులో పెట్టే భోజనం బాలేదు అని.. తనకి ఎగ్ నూడిల్స్ కావాలి అనే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Kolkata Doctor Murder Case Sanjay Roy: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో.. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన వార్త సంచలనంగా మారింది. అతి దారుణంగా ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పట్టుపడ్డ వ్యక్తి సంజయ్ రాయ్. ప్రస్తుతం సంజయ్ రాయ్. ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ లో ఉన్నాడు.
అయితే జైలులో పెడుతున్న ప్రామాణిక భోజనం మీద అతను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. జైలులో ఉన్న ఖైదీలు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించాలి అనేది జైల్లో ఒక రూల్. అదే రూల్ ఫాలో అవుతూ జైల్లో ఉన్న మిగతా ఖైదీలకు పెట్టినట్లే సంజయ్ రాయికి కూడా రోటి సబ్జీ అంటే చపాతీ కూర పెడుతున్నారు.
తాజాగా జైల్లో పెడుతున్న చపాతీ కూర బాగాలేదు అని సంజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక.. తనకి ఎగ్ చౌమెన్ కావాలి అంటూ డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వారిని చంపేయడం మేలు అని.. అలాకాకుండా అసలు భోజనం పెట్టడమే ఎక్కువ అనుకోకుండా.. ఇలాంటి డిమాండ్లు కూడానా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయంపై జైలు సిబ్బంది అతనిని మందలించడంతో చివరికి భోజనం తిన్నాడు అని.. ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోం వర్గాలు తెలిపాయి. ఈ మధ్యనే ఈ కేసు విషయం మీద సంజయ్ రాయ్ మీద లై డిటెక్షన్ టెస్ట్ జరిగింది. అయితే పోలీసు విచారణలో ముందు నేరాన్ని ఒప్పుకున్న సంజయ్ రాయ్ తర్వాత మాత్రం ప్లేట్ మార్చేశాడు. తను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ చెబుతున్నాడు.
లై డిటెక్షన్ టెస్ట్ సమయంలో కూడా అతను బాధితురాలిని చూసేటప్పటికే ఆమె చనిపోయింది అని.. దీంతో భయంతో అక్కడి నుంచి పారిపోయానని చెబుతున్నాడు. అయితే ఈ పరీక్షలో అతను చెప్పిన వాటిల్లో చాలా వరకు జవాబులు నమ్మశక్యంగా లేవు అని పోలీసులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.