Sanjay Roy about Kolkata murder rape case: తాజాగా కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్ని ఇంత దారుణంగా హతమార్చడం నిజంగా బాధాకరమనీ చెప్పాలి .ఆమెను అత్యంత దా,  శారీరకంగా హింసించి, దాడి చేసి ఆమె పై అత్యాచారం చేసి హతమార్చారు. అయితే ఆమె మరణం వెనుక ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ హాస్పిటల్లో డ్రగ్స్ మాఫియా ఎక్కువగా కొనసాగుతోందని,  దానిని బయటపెట్టే ప్రయత్నం ఈ జూనియర్ డాక్టర్ చేసిందని, అందుకే ఆమెపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని వార్తలు వైరల్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా జూనియర్ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతడిని రకరకాలుగా విచారిస్తున్నారు. కానీ ఇప్పుడు మరొకసారి అతడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయగా విస్తుపోయే నిజాలు బయటపెట్టాడు. పాలి గ్రాఫ్ టెస్టులో ఊహించని నిజాలు బయట పెట్టడం అందరిలో కలకలం సృష్టిస్తోంది. 


వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ టెలిగ్రాఫ్ టెస్టులో విస్తూపోయే నిజాలు వెల్లడించారు. తన స్నేహితుడితో కలిసి అదే రోజు మద్యం సేవించామని , సోనాగాచీ , చెట్లా రెడ్లైట్ ఏరియాలకు వెళ్లి వచ్చానని తెలిపాడు. అంతేకాదు తన ప్రియురాలికి ఫోన్ చేసి న్యూడ్ ఫోటోలు పంపించమంటే ఆమె పంపిందట. అనంతరం ఉదయం నాలుగు గంటలకు ఆస్పత్రికి వెళ్తే, సెమినార్ హాల్లో వైద్యురాలు నిద్రిస్తోందని తెలిపాడు. ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆమె చనిపోయి కనిపించిందని తెలిపాడు.



మరి వైద్యురాలి హత్య కేసులో ఎవరు నిందితులు ఎవరు నిర్దోషి అనే విషయం తెలియలేదు కానీ ఈ విషయంపై దేశం మొత్తం అట్టుడికి పోతోంది. వైద్యులు సమ్మే ప్రకటించారు. ఆమెకు న్యాయం జరగాలి అని,  భద్రత లేనిచోట మహిళలు ఎలా ధైర్యంగా వృత్తులు కొనసాగిస్తారు అంటూ తెలుపుతున్నారు. 


ఇకపోతే ఈమె మెడ ఎముక విరిచేసి,  కళ్ళల్లో గుద్ది , రక్తం వచ్చేలా ఆమెను చిత్రవధకు చేశారు. అంతే కాదు ఆమె కడుపులో 150 ఎంఎల్ సెమెన్ గుర్తించారు. అయితే ఇది ఒక వ్యక్తి చేసింది కాదని,  ఒక వ్యక్తికి మాక్సిమం 15 ml మాత్రమే సెమెన్ లభిస్తుందని,  కానీ ఈమె కడుపులో 150 ఎంఎల్  సెమెన్ గుర్తించడంతో గుంపుగా హత్యాచారం చేశారు అంటూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మొత్తానికైతే ఈ వైద్యురాలి హత్యాచార కేసులో రోజుకొక పరిణామం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి