IMA Nationwide Protest :  కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై  అత్యాచారం, హత్య కేసుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభించింది. గురువారం ట్రైనీ డాక్టర్ ముగ్గురు క్లాస్‌మేట్‌లను సిబిఐ విచారించింది.  శనివారం ఉదయం 6గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. రాష్ట్ర శాఖలతో సమావేశం తర్వాత ఐఎంఏ ఈ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వైద్యురాలిప జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా గురువారం విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరిమూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు మోడర్స్ మెడిసిన్ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వైద్య వ్రుత్తి స్వభావం కారణంగా మహిళా వైద్యులు హింసకు గురవుతున్నారు. అలాంటి డాక్టర్లకు ఆసుపత్రులు, క్యాంపస్ లలో భద్రత క ల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని..వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించి అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 


అటు దేశ రాజధానిలో సైతం నిరసనలు చేపట్టేందుకు ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్, ఎస్జేహెచ్, ఎంఏఎంసి ఆసుపత్రుల ఆర్డీఏల ప్రతినిధులు సమావేశమయ్యాయరు. విస్త్రుత చర్చల అనంతరం ఆగస్టు 16న ఢిల్లీ వ్యాప్తగా అన్ని ఆర్డీఏలు న్యూఢిల్లీలోని నిర్మాన్ భవన్ దగ్గర ఉమ్మడిగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. 


Also Read :  Gold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు 


ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కూడా అందోళనలో పాల్గొనవచ్చని ఐఎంఏ తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సమ్మె ప్రకటించాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఆర్వీ అశోకన్‌కు డీఎంఏ సిఫారసు చేసింది. IMA గురువారం సాయంత్రం అన్ని రాష్ట్రాలలోని తన శాఖల అధికారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. శనివారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో సమ్మె చేయాలని నిర్ణయించింది. 


డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని రెసిడెంట్ డాక్టర్ల సంస్థలు ఆరోపించాయి. ఆర్జీ ఆస్పత్రిలోకి ప్రవేశించి వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులపై దాడి చేశారని, ఇది దుర్మార్గపు చర్య అని ఎయిమ్స్ ఆర్డీఏ చైర్మన్ డాక్టర్ ఇందర్ శేఖర్ ప్రసాద్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


 




Also Read : Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి