Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతం

Post Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ స్కీం గురించి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 15, 2024, 07:38 PM IST
Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతం

Bharatiya Post Payment Bank New Scheme : భారత పోస్టల్ శాఖ తపాలా సర్వీసులతోపాటు ప్రస్తుతం చాలా రకాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలను పొదుపు మార్గాల వైపు నడిపించేందుకు సంప్రదాయ సేవింగ్స్ స్కీమ్స్ ను కూడా అందిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించే విధంగా కొత్త కొత్త బీమా పథకాలను అందిస్తోంది. తక్కువ ప్రీమియంతోనే భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజీలను కూడా కల్పిస్తోంది. ప్రైవేట్ కంపెనీల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ..ప్రజలను అటు వైపు తిప్పుకోంటోంది. గత నెలలో సరికొత్త యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రారంభించింది. ఇందులో సంవత్సరానికి రూ. 555 కడితే చాలు రూ. 10లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. 

హెల్త్ ప్లస్ మొదటి ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే సమ్ ఇన్య్షూర్డ్ రూ. 5లక్షలుగా ఉంది. పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోని ఘటన జరిగి మరణించినా..శాశ్వత వైకల్యం పొందినతా..100శాతం సమ్ ఇన్ష్యూర్డ్ అందిస్తుంది. అంతేకాదు పిల్లల పెళ్లి కోసం రూ. 50వేల వరకు చెల్లిస్తారు. అలాగే ఎముకలు విరిగితే..రూ. 35వేలు ఇస్తారు. ఈ హెల్త్ ప్లస్ ప్లాన్ తీసుకోవాలంటే..సంవత్సరానికి ప్రీమియం రూ. 355గా ఉంటుంది. అంటే రూ. 355కే రూ.5లక్షల బీమా లభిస్తుంది. 

ఇక రెండోఆప్షన్ చూస్తే..ఇందులో  పది లక్షల సమ్ ఇన్ష్యూర్డ్ ఉంటుంది. పాలసీదారు మరణించినా..శాశ్వత అంగవైకల్యం చెందితే..100శాతం చెల్లిస్తారు. ఎముకలు విరిగితే రూ. 25వేలు చెల్లిస్తారు. అంత్యక్రియలకోసం రూ. 5వేల క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువు కోసం రూ. 50వేల వరకు పొందవచ్చు. హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ పొందాలనుకుంటే సంవత్సరానికి రూ. 555 ప్రీమియం చెల్లించాలి. 

Also Read : BSNL 4G : గేమ్ ఛేంజర్‎లా మారిన బీఎస్ఎన్ఎల్ 4జీ...అత్యంత చవక ప్లాన్లతో మార్కెట్లో భూకంపం..!!  

మూడో ఆప్షన్ తీసుకున్నట్లయితే సమ్ ఇన్ ష్యూర్డ్ రూ. 15లక్షలు ఉంటుంది. పాలసీదారుడు అనుకోని ఘటనలో మరణించినా..శాశ్వత వైకల్యం చెందినా వంద శాతం ఇన్సూరెన్స్ చెల్లిస్తారు. పిల్లల పెళ్లి కోసం రూ లక్ష ఇస్తారు. ఎముకలు విరిగితే..రూ. 25వేలు ఇస్తారు. హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ లో ఉన్న మాదిరిగానే ఇందులోనూ ప్రయోజనాలు అందుతాయి.

తపాలాశాఖ అందిస్తున్న స్కీములు మూడు ఉన్నాయి. అవి  రూ. 355, రూ. 555, రూ. 755 ఉన్నాయి.  హెల్త్ ప్లస్ పాలసీ కింద తపాలా శాఖ అందిస్తున్న ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్స్ ను  18 నుంచి 65 ఏళ్లు  నిండిన వారు ఎవరైనా తీసుకోవచ్చు. వీరికి ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా మాత్రమే వీటికి సంబంధించిన ప్రీమియం చెల్లించాలి. అంటే.. తీసుకునే పాలసీదారులకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతాను కలిగి ఉండాలి. అయితే, రూ. 355, రూ. 555, రూ. 755 అర్హతలు ఒకేవిధంగా ఉన్న ప్రీమియం ఆధారంగా పొందే ప్రయోజనాలు మాత్రం వేరు వేరు ఉంటాయి. 

Also Read : CIBIL score : ఈ ఒక్క తప్పు చేశారో మీరు లోన్ తీసుకోకపోయినా మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోవడం ఖాయం  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News