Kolkata Doctor Rape and Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం..ఈ దారుణం చోటుచేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే...సూసైడ్ అని ఎలా చెప్పారంటూ ప్రశ్నలతో విరుచుకుపడింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై కూడా సదరు మీడియా సంస్థలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేసు ఎఫ్‌ఐఆర్ ఎందుకు ఆలస్యంగా నమోదు అయ్యిందని...ఆసుపత్రి యంత్రాంగం ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో గురువారం వరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టును ఆదేశించింది. డాక్టర్ల రక్షణ కోసం 10 మంది డాక్టర్లు, నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ టాస్క్ ఫోర్సులో వైద్య నిపుణులు ఉంటారని తెలిపింది. వైద్యుల రక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ తమకు రిపోర్టు ఇస్తుందని కోర్టు తెలిపింది. రిపోర్టుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఘనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్యులు, ఆందోళనలను విరమించుకోవాలని సుప్రీంకోర్టు విన్నవించింది. ఆందోళన వల్ల ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకూడదని పేర్కొంది. వైద్యులకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యం అంటూ సుప్రీం తెలిపింది. 


Also Read : Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్


ఈ దారుణ ఘటనను ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని సూసైడ్ కేసుగా సమాచారం అందించే ప్రయత్నంచేశారు. అతని ప్రవర్తనపై అనుమానాలు ఉంటే..వెంటనే మరో కాలేజీకి అతన్ని ఎలా నియమించారంటూ కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం..డెడ్ బాడీని అంత్యక్రియలకు అప్పగించిన 3గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయారంటూ కోర్టు ప్రశ్నించింది. అప్పటి వరకు పోలీసులు, ఆసుపత్రి అధికారులు ఏం చేస్తున్నారంటూ  చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ ధర్మాసనం ప్రశ్నించింది. 


హత్యే కాకుండా దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్య కూడా ఉన్నందున తాము విచారణ చేపట్టామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. భద్రతకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. అటు ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు బెంగాల్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వైద్యులపై ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడుతున్నారని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. తమ కూతురిపై అత్యాచారం జరిగితే మమతా సర్కార్ వ్యవహారిస్తున్న తీరు తమకు ఎంతో నిరాశ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read : హైదరాబాద్‎లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరిక 


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి