Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్

Ambani Adani News:  దేశంలోని అత్యంత సంపన్నులు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ కొన్నెళ్ల క్రితం ఓ ప్రాజెక్టు కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ కు చెందిన ఓ భారీ ప్రాజెక్టును అదానీ రిలయన్స్ పవర్ కు చెందిన ఒక భారీ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలను తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 20, 2024, 10:58 AM IST
Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్

Adani in talks to buy Reliance Power:  గౌతమ్ అదానీ..దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రపంచంలో ఒక దశలో రెండో స్థానంలో నిలిచారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, విద్యతుత్ సహా అనేక రంగాల్లో అదానీ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన  మూతపడిన కంపెనీని గౌతమ్ అదానీ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ్‌పూర్‌లోని రిలయన్స్ పవర్ 600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్ చర్చలు జరుపుతోందట. ఇందుకోసం గౌతమ్ అదానీ సంస్థ సీఎఫ్‌ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీతో చురుగ్గా చర్చలు జరుపుతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. 

నాగ్‌పూర్‌లోని 600 మెగావాట్ల బుటిబోరి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ. 2000-3000 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ చర్చలు జరుపుతోందని వ్యాపార వార్తాపత్రిక మింట్ పేర్కొంది. డీల్ విలువ ఒక్కో మెగావాట్ కు రూ.4-5 కోట్లు ఉండొచ్చని పేర్కొంది. బుటిబోరి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకప్పుడు దివాలా తీసిన రిలయన్స్ పవర్ యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం ఇది రిలే పవర్  అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది.

పవర్ ప్లాంట్ ధర 6000 కోట్లు:

నివేదికల ప్రకారం..ఈ పవర్ ప్రాజెక్ట్‌లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటి  ధర సుమారు రూ. 6000 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మూతపడి ఉంది. దీనికంటే  ఏప్రిల్‌లో, అనిల్ అంబానీ కంపెనీ మహారాష్ట్రలోని వాష్‌పేట్‌లో ఉన్న పవన విద్యుత్ ప్రాజెక్టును JSW రెన్యూవబుల్ ఎనర్జీకి విక్రయించారు. ఏప్రిల్‌లోనే రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, రిలయన్స్ పవర్ వాష్‌పేట్‌లోని 45-మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును JSW రెన్యూవబుల్ ఎనర్జీ (కోటెడ్) లిమిటెడ్‌కు విక్రయించినట్లు వెల్లడించింది. ఆ సమయంలో  కంపెనీకి రూ.132.39 కోట్లు వచ్చాయి. ఈ కంపెనీని గౌతమ్ అదానీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చర్చలు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయట. 

Also Read : Traffic Alerts In Hyderabad : హైదరాబాద్‎లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరిక 

రిలయన్స్ పవర్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తుందనే వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత, రిలయన్స్ పవర్ షేర్లు ఆకాశాన్ని భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ షేరు ధర సోమవారం అప్పర్ సర్క్యూట్‌ను అంటే 5 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ ఒక షేరు ధర రూ.32.79వద్ద ముగిసింది. 

కాగా ఇప్పటి వరకే దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త అయిన ముకేశ్ అంబానీతో గౌతమ్ అదానీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. అదానీ పవర్ నేత్రుత్వంలో మహాన్ ఎనర్జెన్ లో 5కోట్ల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మధ్య ప్రదేశ్ లో ఈ సంస్థ ఉంది. రిలయన్స్ తన అవసరాల కోసం 500 మెగావాట్ల విద్యుత్ ఉపయోగించుకుంటుంది. 

Also Read : Monthly Income: ప్రతినెలా వడ్డీ రూపంలో ఆదాయం కావాలా? అయితే ఈ టాప్ -3 స్కీమ్స్ గురించి ఓ సారి తెలుసుకోండి 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News