Ktr Counter: గుజరాత్ లా మేం రేపిస్టులను విడుదల చేయలే.. జైల్లో వేశాం! బీజేపీకి కేటీఆర్ కౌంటర్
Ktr Counter: హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఏం చేశారని ప్రశ్నించే వెర్రి ట్రోలర్స్ కు తానిచ్చే సమాధానం ఇదేనంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని చెప్పారు.
Ktr Counter: పంద్రాగస్టు సందర్భంగా గుజరాత్ సర్కార్ 11 మంది రేపిస్టులను విడుదల చేయడంపై దేశ వ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వ తీరుపై విపక్షాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఘటనపై రెండు రోజుల క్రితం స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రధాని మోడీకి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ పై ట్వీట్ పై నెటిజన్లు భారీగా స్పందించారు. కొందరు కేటీఆర్ క మద్దతు పలికితే.. మరికొందరు కౌంటర్లు వేశారు. కేటీఆర్ ట్వీట్ కు రియాక్ట్ అయిన కొందరు కమలం నేతలు.. హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మైనర్ బాలికపై కారులో అత్యాచారానికి పాల్పడిన నిందుతులంతా ఇప్పుడు బయటే ఉన్నారని కామెంట్స్ చేశారు. బీజేపీ నేతల ఆరోపణలకు ట్విట్టర్ వేదికగానే స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు కేసీఆర్.
హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఏం చేశారని ప్రశ్నించే వెర్రి ట్రోలర్స్ కు తానిచ్చే సమాధానం ఇదేనంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని చెప్పారు.45 రోజుల తర్వాత ఆరుగురు నిందితులకు హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. గ్యాంగ్ రేప్ కేసులోని నిందితులను చట్ట ప్రకారం శిక్షించే వరకు తాము పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC, CrPC లోని లొసుగుల ఆధారంగానే నిందితులకు బెయిల్ వస్తుందని చెప్పిన కేటీఆర్.. గ్యాంగ్ రేపు కేసుల్లో నిందితులు బెయిల్‌పై బయటికి రావడానికి చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదన్న తన ఆశయమన్నారు. ఐపీసీ చట్టాల్లో సవరణ చేసి బెయిల్ రాకుండా చేస్తే దోషులు మరణశిక్ష వరకు జైలులోనే ఉంటారని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో చెప్పారు.
Read Also: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి