Janmashtami 2022: నేడు శ్రీకృష్ణ జన్మాష్ఠమి.. భగవద్గీతలోని ఈ బోధనలను ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..

Janmashtami 2022: ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్ఠమి. దేశమంతా శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 19, 2022, 11:00 AM IST
  • నేడు శ్రీకృష్ణ జన్మాష్ఠమి
  • దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
  • జన్మాష్ఠమి రోజున భగవద్గీత బోధనలు తెలుసుకోండి
Janmashtami 2022: నేడు శ్రీకృష్ణ జన్మాష్ఠమి.. భగవద్గీతలోని ఈ బోధనలను ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..

Janmashtami 2022: ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్ఠమి. దేశమంతా శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీమహావిష్ణువు 10 అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎనిమిదో అవతారం. శ్రీకృష్ణుడంటే చిలిపి బాలుడు, గోపాలుడు, రాజనీతిజ్ఞుడు, భగవద్గీత ప్రబోధకుడు. భగవద్గీత వినడమంటే జీవిత సత్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడం. మనలో చాలామంది చాలాసార్లు భగవద్గీత వినే ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్ఠమి సందర్భంగా గీతా సారంలోని కొన్ని ముఖ్య విషయాలను మరొకసారి గుర్తుచేసుకుందాం...

తప్పక తెలుసుకోవాల్సిన భగవద్గీత బోధనలు :

భగవద్గీత ప్రకారం మనిషి నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థ సేవతోనే కోరికలు నెరవేరుతాయి.
భగవద్గీతలో ప్రతీ వ్యక్తి తన పని తాను చేసుకోవాలని చెప్పబడింది. ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో, ప్రశాంత మనసుతో ఉండాలని బోధించబడింది.
భగవద్గీత ప్రకారం మోహం, క్రోదం, లోభం ఈ మూడు నరకానికి ద్వారాల వంటివి. ఈ మూడు గుణాలు మనిషిని నశింపజేస్తాయి. కాబట్టి వీటిని దరిచేరనీయొద్దు.
భగవద్గీత ప్రకారం వ్యక్తి జ్ఞానానికి జిజ్ఞాస ముఖ్యం. గ్రంథాలు, గురు బోధనలు, మీ అనుభవం మిమ్మల్ని జ్ఞానవంతులను చేస్తాయి.
భగవద్గీత ప్రకారం మీకు సంతోషం కలిగించే పనినే చేయాలి. మీరు చేపట్టిన పనిని పూర్తి చేయాలి. అంతే తప్ప అసంపూర్తిగా వదిలిపెట్టవద్దు.
చింత నుంచి బాధ పుడుతుందని భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి చింత వీడి కర్మపై దృష్టి పెట్టాలి.
భగవద్గీత ప్రకారం వ్యక్తికి ఎల్లప్పుడూ స్వీయ-మథనం అవసరం. తద్వారా తన తప్పులను, లోపాలను గుర్తించి సరైన మార్గాన్ని ఎంచుకోగలడు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో తన ఇంద్రియాలన్నింటినీ నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పాడు. ఇంద్రియ నియంత్రణ ఉన్న వ్యక్తికే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సమస్త ప్రాపంచిక సుఖాలను పొందగలడు.

Also Read: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

Also Read: కుమార్తె పుట్టిన రోజు.. 1.10 లక్షల పానీపూరీలు పంచిన తండ్రి! ప్రేమంటే ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News