KVS Recruitment 2022 Notification: కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహిస్తోన్న కేంద్రీయ విద్యాలయాలకు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరుంది. ఇక్కడ సీటు పొందడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో.. అలాగే ఈ విద్యాలయాల్లో ఉద్యోగం చేసే అవకాశం కోసం అంతే ఆసక్తి కనబరుస్తుంటారు. కేంద్రీయ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలకు ఉండే విలువ, అక్కడ పని చేసే సిబ్బందికి సమాజంలో ఉండే గౌరవం, మర్యాదలు అలాంటివి మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులతో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు ఇందులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారి వెబ్ సైట్ kvsangathan.nic.in లోకి లాగిన్ అవ్వండి. ఏయే పోస్టులకు ఎలాంటి విద్యార్హతలు అవసరం, దరఖాస్తు ప్రారంభం, ముగింపు, పరీక్షల తేదీలు వంటి ముఖ్యమైన సమాచారం మొత్తం నోటిఫికేషన్ లో పొందుపరిచారు. 


ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టిజిటి), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి), పిఆర్‌టి మ్యూజిక్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ వంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ విషయానికొస్తే.. లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్డీసీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా హిందీ ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి.  
                                
కేవీఎస్ ప్రకటించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి ఇలా దరఖాస్తు చేసుకోండి.
కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in లోకి లాగాన్ అవ్వండి.
హోమ్‌పేజీలో కనిపిస్తున్న కేవీఎస్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
లింకుపై క్లిక్ చేయడంతోనే కొత్త వెబ్‌పేజీ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా ఐడీ, లాగిన్ పాస్‌వర్డ్ క్రియోట్ చేసుకోండి.
క్రియేట్ చేసుకున్న లాగిన్ క్రెడెన్షియల్స్ సహాయంతో రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోకి లాగిన్ అవండి.
పోర్టల్లో అడిగిన వివరాలను సమర్పించి, అసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
మీ దరఖాస్తును అప్‌లోడ్ చేసి పేజీని సేవ్ చేయండి.
భవిష్యత్ అవసరాల కోసం మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసి భద్రపర్చుకోండి.


మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్టులకు కావాల్సిన అర్హతలు, వయో పరిమితి, తదితర వివరాల కోసం నోటిఫికేషన్ చెక్ చేసుకోగలరు.


Also Read : Muslim Student Video: ముస్లిం స్టూడెంట్‌కి టెర్రరిస్ట్ ముద్ర.. ప్రొఫెసర్‌పై వేటు


Also Read : School Students: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా విమాన, రైలు ప్రయాణం.. ఎక్కడో తెలుసా..!


Also Read : 7th Pay Commission Update: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా ఖాతాల్లో నగదు జమ..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook