Muslim Student Video: ముస్లిం స్టూడెంట్‌కి టెర్రరిస్ట్ ముద్ర.. ప్రొఫెసర్‌పై వేటు

Professor Calling Muslim student as Terrorist: క్లాస్ జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ కి, విద్యార్థికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పరిశీలిస్తే.. '' తనని టెర్రరిస్టుగా ఎలా సంబోధిస్తారు " అంటూ సదరు బాధిత ముస్లిం విద్యార్థి ఆ ప్రొఫెసర్‌ని ఆవేదనతో నిలదీయడం చూడొచ్చు.

Written by - Pavan | Last Updated : Nov 29, 2022, 08:01 AM IST
  • ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అని సంబోఝిచిన ప్రొఫెసర్
  • ప్రొఫెసర్‌తో వాగ్వాదానికి దిగిన విద్యార్థి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Muslim Student Video: ముస్లిం స్టూడెంట్‌కి టెర్రరిస్ట్ ముద్ర.. ప్రొఫెసర్‌పై వేటు

Professor Calling Muslim student as Terrorist: క్లాస్ రూమ్‌లో ముస్లిం స్టూడెంట్‌ని టెర్రరిస్ట్ అని సంబోధించిన ప్రొఫెసర్‌పై మణిపాల్ యూనివర్శిటీ సస్పెన్షన్ వేటు వేసింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో క్లాస్ జరుగుతున్న సమయంలోనే ప్రొఫెసర్ ఒక ముస్లిం స్టూడెంట్ ని టెర్రరిస్టుగా సంబోధించినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ వైఖరితో ఆగ్రహం చెందిన సదరు ముస్లిం విద్యార్థి.. ప్రొఫెసర్ తో వాగ్వాదానికి దిగారు. 

 

క్లాస్ జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ కి, విద్యార్థికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై స్పందించిన యూనివర్శిటీ.. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించామని.. సదరు ప్రొఫెసర్ పై చర్యలు తీసుకున్నామని స్పష్టంచేసింది. తమ విద్యా సంస్థలో జాతి, కుల, మత, లింగ విబేధాలకు తావు లేదని యూనివర్శిటీ వివరణ ఇచ్చింది. 

 

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను పరిశీలిస్తే.. '' తనని టెర్రరిస్టుగా ఎలా సంబోధిస్తారు " అంటూ సదరు బాధిత ముస్లిం విద్యార్థి ఆ ప్రొఫెసర్‌ని ఆవేదనతో నిలదీయడం చూడొచ్చు. దీంతో జరిగిన తప్పిదంపై నాలుక కర్చుకున్న ప్రొఫెసర్.. ఉద్దేశపూర్వకంగా అలా పిలవలేదని.. సరదాగా జరిగిపోయిందని చెప్పడం కూడా వీడియోలో చూడొచ్చు. అయితే ప్రొఫెసర్ ఇచ్చిన సమాధానంతో మరింత ఆగ్రహించిన విద్యార్థి.. ఒక ముస్లిం విద్యార్థిగా నిత్యం ఇలాంటివి ఎదుర్కోవాల్సి రావడం తనకు సరదాగా అనిపించడం లేదు అని హితవు పలికారు.

Also Read : Supreme Court: న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. అలాంటి ప్రకటన చేయకూడదు

Also Read : Ramdev Baba: నేను తీవ్రంగా చింతిస్తున్నా అంటూ.. మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు!
Also Read : Cell Phone Tower: పట్టపగలే సెల్‌ఫోన్‌ టవర్‌ను చోరీ చేసిన దొంగలు.. ఏం కారణం చెప్పారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News