Ladakh: ఈ నెల 20 నుంచి `ఫ్రోజెన్ లేక్ మారథాన్`.. భారత్‌లో తొలిసారిగా..
frozen lake marathon: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సులో `ఫ్రోజెన్ లేక్ మారథాన్` మరో వారం రోజుల్లో మెదలుకానుంది.
Frozen lake marathon 2023: ఈనెల 20 నుంచి లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సులో 'ఫ్రోజెన్ లేక్ మారథాన్' ప్రారంభం కానుంది. దీని కోసం భారత సైన్యం మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశంలో తొలిసారిగా దీనిని నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన అంశాలు
1. ఈ మారథాన్ 13,862 అడుగుల ఎత్తులో జరుగుతుంది. స్వదేశీ మరియు విదేశాల నుండి ఎంపిక చేసిన 75 మంది అథ్లెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగే ఈ "ఫ్రోజెన్-లేక్ మారథాన్" గిన్నిస్ ప్రపంచ రికార్డుగా నమోదయ్యే అవకాశం ఉంది.
2. 21కిమీ రన్ లుకుంగ్ నుండి ప్రారంభమై మాన్ గ్రామం వద్ద ముగుస్తుంది. వాతావరణ మార్పుల సమస్యను హైలైట్ చేయడానికి మారథాన్‌కు "లాస్ట్ రన్" అనే పేరు పెట్టారు.
3. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడఖ్ (ASFL).. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-లేహ్, టూరిజం డిపార్ట్‌మెంట్ మరియు లేహ్ జిల్లా అధికారులతో సహకారంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది.
4. ఈ మెగా ఈవెంట్ స్థిరమైన అభివృద్ధి మరియు కార్బన్-న్యూట్రల్ లడఖ్ కోసం సందేశాన్ని ఇస్తుంది. ఇది చాంగ్‌తంగ్ ప్రాంతం వంటి ఆఫ్‌బీట్ ప్రదేశాలలో పర్యాటకానికి దోహాదపడుతుంది.
5. స్థానిక అథ్లెట్స్ కాకుండా బయట నుంచి వచ్చే వారు అక్కడి వాతావరణానికి అలవాటుపడేందుకు లేహ్‌లో మూడు నుండి నాలుగు రోజుల పాటు ముందుగా గడపడం మంచిది.
6. 21 కి.మీల విస్తీర్ణంలో వైద్య బృందాలు మరియు మారథాన్ అంతటా వేడినీరు అందుబాటులో ఉంటాయి.
Also Read: Aero india 2023: ఆసియాలోనే అతి పెద్ద ఏరో షో.. ఇవాళ బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook