Lakhimpur Kheri: ముందస్తు పథకం ప్రకారమే.. లఖింపూర్ ఖేరి ఘటన! కుట్రతోనే రైతుల్ని చంపారన్న సిట్
Lakhimpur Kheri violence : ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ ఒక కుట్రపూరిత చర్య అంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ స్పష్టం చేసింది.
Lakhimpur Kheri case: Lakhimpur Kheri violence was a 'pre-planned conspiracy', says SIT: ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ ఒక కుట్రపూరిత చర్య అంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ( Uttar Pradesh Police) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (Special Investigation Team) (SIT) పేర్కొంది. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ (SIT) స్పష్టం చేసింది.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఆశిశ్ మిశ్రా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు. (Union Minister Ajay Mishra Teni`s son Ashish Mishra) లఖింపూర్ ఖేరీ హింసాకాండపై దర్యాప్తు చేస్తోన్న సిట్ బృందం ఇందంతా ప్లీ ప్లాన్డ్‌గా జరిగిన కుట్ర అని పేర్కొంది. ఈ కుట్ర వల్ల స్పాట్‌లోనే ఐదుగురు మృతికి చెందారని, పలువురు గాయపడ్డారని వెల్లడించింది.
ఇప్పటికే ఈ కేసులో ఆశిశ్ మిశ్రా, తదితరులు హత్య, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వాటితో పాటు మొత్తం 13 మంది నిందితులపై హత్యా ప్రయత్నం, ఇతర అభియోగాలను జోడించాలంటూ సిట్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ Chief Judicial Magistrate (CJM) (సిజెఎం) ను కోరింది సిట్ బృందం. ఇక IPC 279, 338, 304A సెక్షన్‌ల స్థానంలో కొత్త సెక్షన్‌లను వారెంట్‌లో చేర్చాలని సిట్ దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ వారం కిందటే CJM కోర్టులో దరఖాస్తు చేశారు.
Also Read : సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లఖింపూర్ ఖేరీలో (Lakhimpur Kheri) సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన అన్నదాతలపైకి అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా వాహన శ్రేణిలోని ఎస్‌యూవీ వాహనం ఒకటి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులపైకి ఎస్‌యూవీ వాహనం వేగంగా దూసుకెళ్లడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ హింసాకాండలో స్థానిక జర్నలిస్టు (Journalist) కూడా చనిపోయాడు.
సిట్ ఇప్పటివరకు ఆశిష్ మిశ్రా (Ashish Mishra), లువ్‌కుష్,(Luvkush) ఆశిష్ పాండే, శేఖర్ భారతి, అంకిత్ దాస్, లతీఫ్, శిశుపాల్, నందన్ సింగ్, సత్యం త్రిపాఠి, సుమిత్ జైస్వాల్, ధర్మేంద్ర బంజారా, రింకు రాణా, ఉల్లాస్ త్రివేదిలను అరెస్టు చేసింది.
వారిని లఖింపూర్ ఖేరీ జిల్లా జైలులో (Lakhimpur Kheri district jail) ఉంచారు. ఇదిలా ఉండగా, ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వానికి (state government) రెండు వారాల సమయం ఇచ్చింది.
కేసు (case) విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ వినోద్ షాహి (additional advocate general Vinod Shahi) ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు గురించి కోర్టుకు వివరించారు. ఇంకా పలువురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామంటూ షాహి తెలిపారు.
Also Read : Viral video: ఎదురుగా దూసుకొస్తున్న రైలు-ట్రాక్‌పై ఏనుగు-చివరకు ఏం జరిగిందో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook